కాగా సహజంగా కవలలు పుట్టాలంటే మాత్రం 35 ఏండ్ల లోపే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. కాగా Fertility Centers ద్వారా మాత్రమే కవలలు ఆ వయసులో పుడతారు. అలాగే ట్విన్స్ కోసం మెడిసిన్స్ ను కూడా ఉపయోగించవచ్చట. కానీ వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల Pre-term deliveries అధిక మొత్తంలో అవుతాయట. అంతేకాదు ఆ తల్లికి షుగర్, అనేమియా, బీపీ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కవలలు పుట్టినా వారి ఆరోగ్యం విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందట. కాబట్టి పిల్లలు ఒక్కరూ పుట్టినా ఆరోగ్యంగా ఉంటే చాలు. కవలలు కావాలని లైఫ్ ను రిస్క్ లో పెట్టొద్దని నిపుణులు పేర్కొంటున్నారు.