ఉదయం లేవగానే.. వేడి వేడిగా కాఫీ తాగకపోతే.. ఆ రోజు ఏదో మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కలగడం చాలా కామన్. కాఫీ తాగితే.. శరీరానికి ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పొద్దున్నే ఫ్రూట్ జ్యూస్ తాగి మధ్యాహ్నం దాకా ఉండేవారూ ఉన్నారు. ఇది చాలా మందికి డైట్ కూడా కావచ్చు. అయితే, ఖాళీ కడుపుతో కాఫీ, జ్యూస్ తాగడం , కొన్ని ఆహారాలు తినడం మంచిది కాదు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.