పొడి చర్మంతో బాధపడేవారు ముఖాన్ని స్క్రబ్ చేయడం వలన సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాంటి కొన్ని రకాల స్క్రబ్స్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. ఓట్ మీల్ మరియు కొబ్బరిపాలు స్క్రబ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో గ్రౌండ్ ఓట్ మిల్ తీసుకోండి.తర్వాత దానికి కొన్ని చుక్కల కొబ్బరినూనె, కొబ్బరిపాలు కలపండి.
మీ ఫేస్ ని స్క్రబ్ అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోండి. తేలికపాటి చేతులతో మీ ముఖంపై స్క్రబ్ చేసి కాసేపటి తరువాత మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే బొప్పాయి మరియు పైనాపిల్ స్క్రబ్ కూడా పొడి చర్మం నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
దీనిని తయారు చేయటానికి బొప్పాయి మరియు పైనాపిల్ ను సమపాళ్లల్లో తీసుకొని బాగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో తేనెతో పాటు ఒక స్పూన్ చక్కెర పొడి జోడించండి. ఈ మిశ్రమాన్ని చేతులతో తేలిగ్గా మీ ముఖాన్ని మసాజ్ చేయండి.
కాసేపటి తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోండి. అలాగే మరొక రకమైన స్క్రబ్ రోజ్ మరియు ఓట్. శీతాకాలంలో గులాబీ మరియు ఓట్ స్క్రబ్ తో మీ ముఖం కోల్పోయిన మెరుపుని తిరిగి పొందవచ్చు. గులాబీ రేకులను మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దానికి గ్రౌండ్ ఓట్స్ జత చేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి రోజు వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి మెత్తగా మసాజ్ చేయండి. తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కున్న తర్వాత గులాబీ లాంటి మెరుపుని మీరు గమనించవచ్చు. అలాగే స్ట్రాబెరీ మరియు కలబంద స్క్రబ్ కూడా పొడి చర్మానికి చాలా మంచిది.
రెండు స్ట్రాబెర్రీలను మెత్త గుజ్జు లాగా చేసే దానికి రెండు టీ స్పూన్ల బాదం నూనెతో పాటు ఒక టేబుల్ స్పూన్ చక్కర పొడిని జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఎప్పటిలాగే కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది.