Tan Removal: సమ్మర్‍లో చర్మం త్వరగా టాన్ అయిపోతుంది. టాన్ రిమూవ్ చేయించుకోవడానికి ప్రతిసారీ పార్లర్‍కు వెళ్లడం వల్ల ఖర్చు కాబట్టి ఇంట్లోనే ఈజీగా తగ్గించుకోవాలనుకుంటే ఈ సింపుల్ హోమ్ రిమెడీ ట్రై చేయండి. 7 రోజుల్లో మీ ముఖం మెరిసిపోతుంది.
టాన్ రిమూవ్ చేయడానికి ఇంట్లో ఈజీగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. పార్లర్‍కు వెళ్లాల్సిన పని ఉండదు. పైసా ఖర్చు లేకుండా టాన్ రిమూవ్ అయిపోద్ది. మీ ముఖం కూడా మెరిసిపోద్ది. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం పెద్ద కష్టమేమి కాదు. చిటికెలో సులభంగా రెడీ చేసుకోవచ్చు.
23
సహజమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది
ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ కాఫీ పొడి కలపాలి. తరువాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం, కన్సిస్టెన్సీకి తగ్గట్టు రోజ్ వాటర్ వేసి స్మూత్‌గా కలుపుకోవాలి. ఈ పేస్ట్ చర్మానికి సహజమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది.
33
7 రోజుల్లోనే చర్మంలో తేడా కనిపిస్తుంది
తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి లేదా టాన్ అయిన భాగాలకు సమంగా అప్లై చేయాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి, తర్వాత మెల్లగా రుద్దుకుంటూ కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, డెడ్ స్కిన్ తొలగి క్రమంగా టాన్ తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ ప్యాక్‌లో ఉపయోగించే పదార్థాలు అన్నీ సహజమైనవే కావడంతో చర్మానికి హాని చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బియ్యం పిండి స్క్రబ్‌లా పనిచేసి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. కాఫీ చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగు తేమను అందిస్తే, నిమ్మరసం టాన్ తగ్గించడంలో తోడ్పడుతుంది. వారానికి 2 సార్లు ట్రై చేస్తే 7 రోజుల్లోనే చర్మంలో తేడా గమనించవచ్చు.