ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవాలి. ఎందుకంటే అలసి సొలసిన శరీరం నిద్రలోనే శక్తివంతంగా మారుతుంది. అందుకే రోజుకు 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కంటినిండా నిద్రపోతేనే మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఎన్నో రోగాలు కూడా దూరమవుతాయి. కానీ ఈ రోజుల్లో అన్ని వయసుల వారు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమికి సోషల్ మీడియా, ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, మానసిక ఆరోగ్య సమస్యలు, కొన్ని రకాల శారీరక సమస్యలు వంటి కారణాలున్నాయి.