రాత్రిపూట తలస్నానం చేస్తే... ఆ సమయంలో జుట్టు తొందరగా ఆరదు. కాబట్టి... అదే తడి తలతో నిద్రపోవాల్సి వస్తుంది. అతా తడి జుట్టుతో పడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఉదయాన్నే అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్లాలి.. లేదంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలన్నా, ఏదైనా శుభకార్యం ఉన్నా చాలా మంది రాత్రిపూటే తలస్నానం చేస్తూ ఉంటారు. ఉదయాన్నే చేయడానికి సమయం పడుతుందని.. రాత్రిపూట చేస్తే.. చాలా వరకు సమయం సేవ్ అవుతుందని భావిస్తూ ఉంటారు. కొందరైతే.. రెగ్యులర్ గా రాత్రిపూట తలస్నానం చేస్తూ ఉంటారు. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? కానీ.. ఈ అలవాటు కారణంగా మీ జుట్టు ఎంతలా డ్యామేజ్ అవుతుందో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
24
తడి జుట్టు వల్ల కలిగే నష్టం....
రాత్రిపూట తలస్నానం చేస్తే... ఆ సమయంలో జుట్టు తొందరగా ఆరదు. కాబట్టి... అదే తడి తలతో నిద్రపోవాల్సి వస్తుంది. అతా తడి జుట్టుతో పడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. తలస్నానం తర్వాత మన జుట్టు క్యూటికల్ తెరిచి ఉంటుంది. అందుకే.. తడి జుట్టును దువ్వకూడదు అని కూడా చెబుతుంటారు. అలా దువ్వితే.. ఎక్కువగా జుట్టు రాలిపోతుంది.
34
బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం...
జుట్టు ఆరకుండా.. తడి తలతో నిద్రపోవడం వల్ల తలలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అంటే.. దీని వల్ల తలలో చుండ్రు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు విపరీతంగా రాలడం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతుంది. పొడిగా మారిపోతుంది. అందంగా కూడా కనిపించదు.
మరి.. రాత్రిపూట తలస్నానం అస్సలు చేయకూడదా అంటే చేయచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తెలుసుకోవాలి. మీరు రాత్రిపూట తలస్నానం చేయాల్సి వస్తే..జుట్టు మొత్తం పొడిగా మారిన తర్వాత మాత్రమే.. నిద్రపోవాలి. అంతేకాదు... మీ జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి లీవ్ ఇన్ కండిషనర్ ఉపయోగించాలి. చిక్కులు మొత్తం తీసేసిన తర్వాత మాత్రమే పడుకోవాలి. అప్పుడు హెయిర్ డ్యామేజ్ అవ్వగుండా ఉంటుంది.