Warm Water: వేడినీళ్లను తాగడం వల్ల మంచే కాదు.. చెడు కూడా జరుగుతుంది జాగ్రత్త..

Published : Jul 09, 2022, 12:47 PM IST

Warm Water: వేడి నీళ్లను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ.. కాదు. ఈ నీళ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అలా అని వేడినీళ్లను మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.  

PREV
16
Warm Water: వేడినీళ్లను తాగడం వల్ల మంచే కాదు.. చెడు కూడా జరుగుతుంది జాగ్రత్త..

నీళ్లు (Water) ఎన్నోఅనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.  అందులో వేడి నీళ్లు (Warm Wate) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేడి నీళ్లను తాగడం వల్ల రక్తప్రసరణ (blood circulation) మెరుగుపడుతుంది. ఒత్తిడి (stress)నుంచి ఉపశమనం కలుగుతుంది.

26

వేడినీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలా అని వేడి నీళ్లను మరీ ఎక్కువగా తాగితే కూడా ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వేడి నీళ్లను తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలేంటో తెలుసుకుందాం పదండి.. 
 

36

వేడినీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

మలబద్దకం (constipation)నుంచి ఉపశమనం లభిస్తుంది

రోజంతా కొద్ది కొద్దిగా వేడినీళ్లను తాగితే పొట్ట ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. వీడి నీళ్లు ఎసిడిటీ (Acidity), అజీర్థి (indigestion), కడుపు నొప్పి (Stomach ache)వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. 

46

బరువును తగ్గిస్తాయి

గోరు వెచ్చని నీళ్లు బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. ఈ నీళ్లు ఆహారం తొంతరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం సాయంత్రం వేళల్లో తిన్న వెంటనే కాసిన్ని గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. 

56

చర్మ సమస్యలను తొలగిస్తుంది

చర్మ సమస్యలను తొలగించడంలో గోరువెచ్చని నీళ్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖంపై ముడతలు (Wrinkles), మచ్చలు (Spots), మొటిమలు వంటి సమస్యలన్నింటినీ గోరువెచ్చని నీళ్లు పోగొడుతాయి. అంతేకాదు ఇది చర్మ రక్త ప్రసరణను (blood circulation) కూడా మెరుగుపరుస్తుంది. 
 

66

వేడినీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు

మూత్రపిండాల సమస్యలు వస్తాయి

మూత్రపిండాలు (Kidneys) మన శరీరంలోని వ్యర్థాలను, విషాలను  బయటకు పంపేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాంటి వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే రోజంతా వేడి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. వేడినీళ్ల కారణంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి.. దీని పనితీరు దెబ్బతింటుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories