గురువారం రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో.. ఏ దేవుడికి ఏ మిఠాయి పెట్టాలో తెలుసా?

Navya G   | Asianet News
Published : Jan 05, 2022, 03:36 PM IST

 గురువారం (Thursday) రోజు పూజ విధానాన్ని ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోయి అంతా శుభమే జరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని ఇబ్బందులు (Difficulties) తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అయితే గురువారం ఆచరించిన పూజా విధానం, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ రంగు మిఠాయి దేవునికి సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
17
గురువారం రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో.. ఏ దేవుడికి ఏ మిఠాయి పెట్టాలో తెలుసా?

గురువారం రోజున పూజను ఆచరించే సమయంలో తప్పనిసరిగా పసుపు రంగు దుస్తులను (Yellow dress) ధరించడం మంచిది. గురువారం సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున సాయిబాబాను నియమనిష్ఠలతో పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. సాయిబాబాకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, పూలతో పూజ చేస్తే ఆ స్వామి అనుగ్రహం (Grace) పొందవచ్చును.
 

27

ఈ రోజున పేద ప్రజలకు అన్నదానం (Annadanam) చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. సాయిబాబాకు నైవేద్యంగా హల్వా, పాలకూరను సమర్పించుకుంటే రుణబాధలు, ఈతిబాధలు, శత్రుబాధలు తొలగిపోయి సంతోషంగా (Happy) ఉంటారు. సంతాన ప్రాప్తి కలగాలంటే సాయిబాబాకు పూలమాలను, స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ను సమర్పించుకుంటే మంచిది.
 

37

గురువారం రోజున సాయిబాబాకు పసుపు రంగు పువ్వులను సమర్పించాలి. తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతమాచరిస్తే మీ సంకల్పసిద్ధి నెరవేరుతుంది. ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడూ మీ మీద ఉంటుంది. ఇంకా గురువారం పూట సాయిబాబాకు కొబ్బరికాయ (Coconut), నైవేద్యంగా కిచిడీ (Kichidi) సమర్పిస్తే మంచిది. మీకు సకల సంపదలు కలుగుతాయి.
 

47

గురువారం రోజున మహా విష్ణువుకి లేదా హనుమంతునికి పూజ చేసిన అనంతరం భుజించాలి. గురువారం పూజను ఆచరించేవారు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి ఐదు గంటల ప్రాంతంలో పూజ గదిలో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. గురువారం రోజున ఉపవాసం (Fasting) ఆచరించేవారు ఉప్పు (Salt) కలిగిన ఆహార పదార్థాలను తినకూడదు. 
 

57

గురువారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ రోజున ఆంజనేయ స్వామిని (Anjaneya Swami) పూజిస్తే ధైర్యం, ధ్యానం, బలం లభిస్తాయి. గురువారం రోజున ఆంజనేయస్వామికి తమలపాకులు, సింధూరంతో పూజిస్తే కోరిన కోరికలు (Desires) నెరవేరుతాయి. తులసి మాలను ఆంజనేయస్వామికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు  పొందుతారు.
 

67

ఈ స్వామికి వడమాల, తమలపాకు మాల, వెన్నతో అర్చిస్తే కుటుంబంలో సంతోషాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) తొలగిపోతాయి. అలాగే పసుపు రంగులో ఉండే మిఠాయిని (Yellow sweet) స్వామికి సమర్పించడం మంచిది.
 

77

గురువారం రోజున అరటి చెట్టును (Banana tree) పూజించాలనుకునేవారు చెట్టు ముందర నెయ్యితో (Ghee) వెలిగించిన దీపాన్ని ఉంచితే ఈతిబాధలు తొలగిపోతాయి. అరటి చెట్టును శుభ్రపరిచి శనగలు, పసుపు అర్పించుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే పసుపు రంగు బట్టలను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!

Recommended Stories