సపోటా పండుతో అందమైన చర్మం మీ సొంతం.. ఇలా చేస్తే చాలు!

First Published Jan 5, 2022, 2:30 PM IST

సపోటా (Sapota) పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ వంటి ఖనిజ గుణాలు చర్మసౌందర్యాన్ని జుట్టు సౌందర్యాన్ని పెంచుతాయి. కనుక వీటిని తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం సపోటా పండుతో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ (Beauty Benefits) గురించి తెలుసుకుందాం..

సపోటా పండ్లును చికూ (Chiku) అని కూడా పిలుస్తారు. ఇది రుచికి తియ్యగా (Sweet) ఉంటుంది. సపోటా పండు ఆరోగ్యాన్ని అందించే ఔషధ గని. ఇందులో పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాలీఫెనోలిక్ అనామ్లజనకాలు, విటమిన్లు, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
 

వీటితో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ (Antiviral), యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యంతో పాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని పెంచుతాయి. కనుక సపోటాలను నేరుగా లేక జ్యూస్ రూపంలో ఇలా ఏదో ఒక విధంగా శరీరానికి అందిస్తే మంచి ఫలితం లభిస్తుంది. 
 

Latest Videos


చర్మం తాజాగా మారుతుంది: ఒక కప్పులో సపోటా గుజ్జు (Sapota pulp), పెరుగు (Yogurt), నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం తాజాగా మారుతుంది
 

ముడతలను తగ్గిస్తుంది: ఒక కప్పులో సపోటా గుజ్జు (Sapota pulp), తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
 

ముఖాన్ని కాంతివంతంగా మారుతుంది: ఒక కప్పులో బాగా పండిన సపోటా గుజ్జు (Sapota pulp), బేకింగ్ సోడా (Baking soda) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కణాలలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
 

జుట్టు మృదువుగా మారుతుంది: సపోటా విత్తనాల (Sapota seeds) నుంచి తీసిన నూనెను జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టుకు తగిన తేమ అంది జుట్టు ఒత్తుగా, మృదువుగా మారుతుంది. జుట్టుకు మంచి నిగారింపు అందుతుంది. జుట్టు కుదుళ్లకు తగిన పోషణ (Nutrition) అంది జుట్టు వేగంగా పెరుగుతుంది.
 

చుండ్రు సమస్యలు తగ్గుతాయి: కలుషిత వాతావరణం, ఇన్ఫెక్షన్ ల కారణంగా తలలో ఏర్పడిన చుండ్రును తగ్గించడానికి సపోట విత్తనాలు సహాయపడతాయి. సపోటా విత్తనాలను ఆముదంతో (Castor oil) కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకొని మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు (Dandruff) నుంచి విముక్తి కలుగుతుంది.

click me!