గుడ్డు తాజాగా ఉందని ఎలా తెలుసుకోవాలి?
గుడ్డు చెడిపోకుండా, తాజాగా ఉందో? లేదో తెలుసుకోవడానికి ఉప్పు కలిపిన చల్లని నీటిలో వాటిని పెట్టండి. ఒకవేళ ఆ నీటిలో గుడ్డు మునిగిపోతే అది తాజాగా ఉన్నట్టు. ఒకవేళ గుడ్డు నీళ్లపైన తేలితే గుడ్డు చెడిపోయిందని అర్థం.
చల్లటి నీటిలో..
ఉడికించిన గుడ్డు తొక్కను సులువుగా తీయాలంటే ఇవి ఉడికిన తర్వాత చల్లని నీటిలో వేయండి. ఐదు నిమిషాల తర్వాత గుడ్లను తొక్కను వలచండి. సులువుగా తొక్కలు ఊడిపోతాయి.