కుబేర బొమ్మను ఇంట్లో ఈ దిశలో పెడితే డబ్బుకు కొదవే ఉండదు.. అలాగే..

First Published | Oct 30, 2023, 2:47 PM IST

కుబేర బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు. ఈ బొమ్మ సకల సమస్యలు తొలగిస్తుందని, ఐశ్వర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. మరి ఈ బొమ్మను ఏ దిశలో ఉంచాలంటే? 

kubera yantra

చాలా మంది ఇళ్లలో కుబేర బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బొమ్మకు పూజలు కూడా చేస్తుంటారు. ఇంట్లో ఈ బొమ్మను పెట్టడం వల్ల జీవితంలో శ్రేయస్సు, పురోభివృద్ధి, సంపద, విజయం లభిస్తాయని నమ్ముతారు. అయితే చాలా మందికి ఈ బొమ్మను ఏ దిశలో ఉంచాలో మాత్రం తెలియదు. అందుకే ఫలితాలను పొందరు. 

బౌద్ధమతాన్ని అనుసరించేవారు కుబేర బొమ్మను దైవంగా ఆరాధిస్తారట. ఈ కుబేర బొమ్మ ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని, దురదృష్టాన్ని తొలగించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మరి ఈ చిరునవ్వులు చిందిస్తున్న ఈ బొమ్మ మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించి మనల్ని ఆనందంగా ఉంచుతుంది. కుబేరుని బొమ్మ సకల బాధలను తొలగించి ఐశ్వర్యాన్ని, సంపదను తెస్తుందని నమ్ముతారు. అయితే కొంతమంది తమ ఇండ్లలో గొడవలు, కొట్లాటలు జరగకూడదని కూడా ఈ బొమ్మను పెడుతుంటారు. 


guberar statue

కుబేర బొమ్మతో కలిగే ప్రయోజనాలను పొందాలంటే మాత్రం ఈ బొమ్మను మీ ఇంట్లో సరైన దిశలోనే పెట్టాలి. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. శత్రు భయం ఉండదు. మీ పని ప్రదేశంలో కుబేర బొమ్మను పెడితే పనిలో మీ శ్రేయస్సు, ఆదాయం పెరుగుతుంది. పిల్లలు చదివుకునే టేబుల్ పైన ఈ బొమ్మను పెడితే పిల్లలు చదువులో రాణిస్తారు. అలాగే పిల్లల్లో సోమరితనం పోతుంది. చదువుపై శ్రద్ధ పెడతారు. అందుకే  కుబేర బొమ్మ ఏ దిశలో పెడితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇంట్లో కుబేర బొమ్మను తూర్పు దిక్కుకుగా పెట్టడం మంచిదని నమ్ముతారు. ఈ దిశలో కుబేర బొమ్మను పెట్టడం వల్ల మీ ఇంట్లో సంతోషం, శాంతి కలుగుతాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతారు. 

Lakshmi kubera poja

అలాగే ఇంట్లో కుబేర బొమ్మను ఉత్తరం వైపున కూడా పెట్టొచ్చట. ఫలితంగా మీ ఇంట్లో శ్రేయస్సు, సంపద, శాంతి నెలకొంటాయి. అలాగే మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారట. 

మీరు పడుకునే గదిలో లేదా డైనింగ్ రూం లో కుబేర బొమ్మను ఆగ్నేయ దిశలో ఉంచితే అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మీ ఇంటి ఆదాయం కూడా  బాగా పెరుగుతుందట. అయితే ఈ కుబేర బొమ్మను ఇతరులకు బహుమతిగా ఇచ్చినా కూడా ఫలితం ఉంటుందని నమ్ముతారు. కుబేర విగ్రహాన్ని బహుమతిగా ఇస్తే ఇచ్చిన వారికి, తీసుకున్నవారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. 

Latest Videos

click me!