పంచదారను వంటకాలకే వాడతారు. నిజానికి దీంతో జుట్టును కూడా బలంగా మార్చుకోవచ్చు. ఇది ఒక మంచి 'ఎక్స్‌ఫోలియెంట్'గా (Exfoliant) కూడా పనిచేస్తుంది. అంటే చర్మంపై ఉన్న మృతకణాలు, మురికిని సున్నితంగా తొలగిస్తుంది. షాంపూతో కలిపినప్పుడు, ఇది తల మాడు (Scalp) ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు మెరిసేలా చేస్తుంది.
ఈ మిశ్రమం తల మాడుపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగిస్తుంది. పేరుకుపోయిన జిడ్డును (Oil) కంట్రోల్ చేస్తుంది. హెయిర్ స్ప్రే, జెల్ వంటి వాటి అవశేషాలను లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా జుట్టు చాలా శుభ్రంగా, మెరుస్తూ (Shiny) కనిపిస్తుంది.