Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?

Published : Sep 06, 2026, 11:09 AM IST

Air fryer: ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటోంది. అయితే ఆ ఎయిర్ ఫ్రైయర్ లో స్టీలు గిన్నెలు పెట్టొచ్చా అనే సందేహం ఎక్కువ మందికి ఉంటుంది. అలా పెడితే ఏమవుతుందో తెలుసుకోండి.

PREV
13
ఎయిర్ ఫ్రైయర్లో స్లీలు గిన్నెలు పెట్టొచ్చా?

ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ వినియోగం పెరిగిపోయింది. తక్కువ నూనెతో వేపుళ్లు, స్నాక్స్ తయారు చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది.అయితే చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం ఏమిటంటే, ఇందులో సాధారణ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను వాడవచ్చా లేదా అని. నిపుణుల ప్రకారం.. ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలను నిరభ్యంతరంగా వాడవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ అనేది మైక్రోవేవ్ ఒవెన్ లాగా కాకుండా, కన్వెక్షన్ ఒవెన్ తరహాలో అధిక ఉష్ణోగ్రత గల వేడి గాలితో పనిచేస్తుంది. కాబట్టి నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు, బేకింగ్ ట్రేలు దీని వేడిని సులభంగా తట్టుకోగలవు. అయితే పాత్రలకు ప్లాస్టిక్, రబ్బర్ లేదా చెక్కతో చేసిన పిడులు (హ్యాండిల్స్) ఉండకూడదు. కేవలం శుద్ధమైన స్టీల్‌తో తయారైన, ఓవెన్-సేఫ్ పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం.

23
పాటించాల్సిన జాగ్రత్తలు

స్టీల్ పాత్రలు సురక్షితమే అయినప్పటికీ, వాటిని వాడేటప్పుడు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ పరిమాణానికి సరిపోయే చిన్న లేదా మధ్యస్థ సైజు గిన్నెలను మాత్రమే ఉంచాలి. బాస్కెట్ అడుగు భాగం మొత్తం మూసుకుపోయేలా పెద్ద గిన్నెలు పెడితే వేడి గాలి ప్రసరణ (ఎయిర్‌ఫ్లో) ఆగిపోతుంది. దీనివల్ల లోపల ఉన్న ఆహారం సమానంగా ఉడకదు. గిన్నె చుట్టూ గాలి స్వేచ్ఛగా తిరిగేందుకు తగినంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. అలాగే గిన్నెలోని ఆహారం పైభాగంలో ఉండే హీటింగ్ కాయిల్‌కు మరీ దగ్గరగా తగలకుండా తగినంత ఎత్తు ఉండేలా జాగ్రత్తపడాలి. గ్రేవీలు లేదా నూనె కారిపోయే అవకాశం ఉన్న వంటకాలకు చిన్న స్టీల్ గిన్నెలు చక్కగా ఉపయోగపడతాయి.

33
తెలుసుకోవాల్సిన నియమాలు

ఎయిర్ ఫ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్, పార్చ్‌మెంట్ పేపర్‌లను వాడవచ్చు కానీ, వాటిని వదులుగా వదిలేయకూడదు. గాలి వేగానికి అవి ఎగిరి హీటింగ్ ఎలిమెంట్‌ను తాకితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిపై ఆహారం బరువు ఉండేలా చూసుకోవాలి. అలాగే గాజు పాత్రల విషయానికి వస్తే కేవలం ఓవెన్-సేఫ్ గాజును మాత్రమే వాడాలి. ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి గాజు గిన్నెలను నేరుగా వేడి ఎయిర్ ఫ్రైయర్‌లో పెడితే ఉష్ణోగ్రత మార్పుకు అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. వీటన్నింటికంటే ముఖ్యంగా మైక్రోవేవ్-సేఫ్ అని రాసి ఉన్నప్పటికీ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, మెలమైన్ గిన్నెలను ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టకూడదు. ఇవి తీవ్రమైన వేడికి కరిగిపోయి ఆహారాన్ని విషతుల్యం చేస్తాయి. ఈ ప్రాథమిక నియమాలు పాటిస్తే ఎయిర్ ఫ్రైయర్‌ను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories