బీపీ తగ్గాలంటే ఈ పానీయాలను తాగండి..

First Published Nov 11, 2022, 2:10 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒత్తిడి, అధిక ఉప్పు, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మొదలైనవి రక్తపోటును అమాంతం పెంచుతాయి. రక్తపోటు పెరిగితే.. గుండెపోటు, స్ట్రోక్ వంటి అనేక సమస్యలు వస్తాయి.

ఒకప్పుడు మధ్య వయస్కులు, పెద్దవారిలోనే అధిక రక్తపోటు సమస్య వస్తుండేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు, యువత కూడా హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటును సకాలంలో గుర్తించకపోవడం, దానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒత్తిడికి గురికావడం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మొదలైనవి రక్తపోటును పెంచుతాయి. కానీ ఈ అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కానీ రక్త పోటును నియంత్రించడానికి ఆహార మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అధిక రక్తపోటును నియంత్రించడానికి మీ ఆహారంలో చేర్చాల్సిన కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

avocado

అవొకాడో జ్యూస్

అవొకాడోలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అవోకాడోలలో పొటాషియం, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ గుండె  ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే అవొకాడో జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోండి. 
 

బనానా షేక్

బనానా షేక్ కూడా అధిక రక్తపోటును తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. అరటిపండులో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక మీడియం సైజు అరటిలో 422 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. అరటి షేక్ లేదా  బనానా జ్యూస్ ను తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

స్ట్రాబెర్రీ జ్యూస్

స్ట్రాబెర్రీ ల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. హైబీపీ సమస్యతో బాధపడేవారికి స్ట్రాబెర్రీ జ్యూస్ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

టొమాటో జ్యూస్

టొమాటో జ్యూస్ పోషకాల భాండాగారం. 100 గ్రాముల టమోటాల్లో 237 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం బీపీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. టమోటా జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గడంతో పాటుగా చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. 

దానిమ్మ రసం

దానిమ్మ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మలు బిపిని నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
 

click me!