ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య దారుణంగా పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతే వీళ్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా దీనివల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది. గుండెపోటు ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ షుగర్ వ్యాధి కొంత మందికి చెడు ఆహారాలు, లైఫ్ స్టైల్ వల్ల వస్తే, ఇంకొంత మందికి మాత్రం జన్యుపరంగా వస్తుంటుంది. షుగర్ పేషెంట్లు అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలనే ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే అన్నం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రొట్టె అయితే అలా కాదు. మధుమేహులు ఒక్క గోధుమ రొట్టెలనే కాదు.. వేరే పిండి తో చేసిన రొట్టెలు కూడా తినొచ్చు. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అవేంటంటే..