అదే పాత దీపావళి స్వేట్లే కానీ.. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి..

First Published | Oct 23, 2022, 10:01 AM IST

రోజు రోజుకు ఎన్నో కొత్త కొత్త స్వీట్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి స్వీట్లు ఎన్ని వచ్చినా.. ఎనకటి నుంచి మనం తింటూ వస్తున్న స్వీట్ల రుచి మాత్రం ఎప్పటికీ అద్భుతంగా, అమోఘంగానే ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచివి. 


దీపావళికి  స్వీట్లే స్పెషల్. అందుకే ప్రతి ఇంట్లో నోరూరించే స్వీట్లు తప్పనిసరిగా ఉంటాయి. అంతేకాదు తీరొక్క స్నాక్స్ గుమగుమలాడుతుంటాయి. అయితే కొంతమందికి వీటిని ఇంట్లో తయారుచేసే టైం లేక మార్కెట్లో కొంటుంటారు. కానీ మార్కెట్ లో కొన్న స్వీట్లు, స్నాక్స్ లో ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలుంటాయి. ఇలాంటి వాటిని హార్ట్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ అసలే తినకూడదు. అయితే మనం ఎన్నో ఏండ్ల నుంచి తయారుచేసుకుని తింటున్న దీపావళి వంటకాలు మాత్రం ఇప్పటికీ అంతే టేస్ట్ తో ఉంటాయి. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిని ఎవ్వరైనా తినొచ్చు. ఇంతకి అవేంటో.. వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి. 
 

బియ్యం పిండి మురుకులు/ చక్లీలు

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు కొవ్వు తక్కువున్న పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిటికెడు ఆసాఫోటిడా, రుచికి సరిపడా ఉప్పు . 
 


తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని పై పదార్థాలన్నింటినీ వేసి బాగా కలగలపండి. దీంట్లో నీళ్లు పోసి మొత్తని పిండిలా తయారుచేయండి. మురుకుల మెషిన్ లో పిండిని పెట్టి చక్లీలను వత్తండి. 180C వద్ద ప్రీ హీటెడ్ ఓవెన్ లో చక్లీలను 35 నిమిషాల పాటు బేక్ చేయండి. ఇవి చల్లారిన తర్వాత తింటే టేస్టీగా ఉంటాయి. 
 

హెల్తీ బేసన్ బర్ఫీ

కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు శెనగపిండి, 1/4 కప్పు నెయ్యి, 8 యాలకులు (పొడి), 1/3 కప్పుల వాటర్, 1/2 కప్పుల బెల్లం పొడి, తరిగిన జీడిపప్పులు, బాదం పలుకులు. 
 

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి బెల్లం పొడిని వేయండి. తక్కువ మంటపై వేడి చేస్తూ.. అది చిక్కబడిన తర్వాత పక్కన పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణలీ తీసుకుని అందులో శెనగ పిండిని వేయండి. తక్కువ మంటపై దీన్ని ఉంచి రోస్ట్ చేయండి. ఆ తర్వాత 1/4 కప్పు నెయ్యిని దీనిలో వేయండి. 30 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం  కొద్దిగా గోధుమ రంగులోకి మారి క్రీములా మారుతుతుంది. అప్పుడు దీంట్లో తయారుచేసి పెట్టుకున్న చిక్కటి బెల్లం సిరప్ ను వేసి 1 నిమిషం పాటు బాగా కలపండి. తర్వాత మంటను ఆఫ్ చేసి నెయ్యి రాసిన ట్రే లోకి తీసుకోండి. దీనిపై నట్స్ ను వేసి బర్పీ షేప్ లో కట్ చేసుకుంటే సరి.. వీటిని చల్లారిన తర్వాత తింటే బలే టేస్టీగా ఉంటాయి. 
 

షుగర్ లెస్ కాజు కట్లీ

కావాల్సిన పదార్థాలు:  2 కప్పుల జీడి పప్పులు,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ముడి తేనె, పాలు, యాలకుల పొడి.
 

తయారీ విధానం: ముందుగా రెండు కప్పుల జీడిపప్పులను 180C వద్ద ఓవెన్ లో 5 నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత జీడిపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత పేస్ట్ చేయండి. స్టవ్ పై ఒక బాణలీ పెట్టుకుని అందులో పాలు మరిగించండి. అందులో జీడిపప్పు పేస్ట్ ను వేయండి. అడుగు మాడిపోకుండా చూసుకోండి. దీనిలో నెయ్యి యాలకుల పొడి, ముడి తేనె వేసి ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మళ్లీ ఒకసారి కలిపి.. నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోండి. దీన్ని చపాతీలు వత్తే కర్రతో వెడల్పుగా చేసి.. కాజు కట్లీ షేప్ లో కట్ చేసుకోండి. 

Latest Videos

click me!