Diabetes Diet: షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే ఇవి తినండి..

Published : Apr 05, 2022, 01:58 PM IST

Diabetes Diet: ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. 

PREV
112
Diabetes Diet: షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే ఇవి తినండి..

Diabetes Diet: ప్రస్తుత కాలంలో ఈ డయాబెటీస్ సమస్య చిన్న వయసు వారిని కూడా వేధిస్తోంది. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. చెడు జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ షుగర్ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. 

212

ఈ వ్యాధిగ్రస్తులు వైద్యులు సూచించిన మందులను రెగ్యులర్ గా వాడుతూనే.. వీరి ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

312

శారీరక శ్రమ.. శారీరక శ్రమ చేయనివారికే డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు రోజుకు 30 నిమిషాల పాటు చిన్నపాటి ఎక్సర్ సైజెసె లేదా స్మిమ్మింగ్, బరువులు ఎత్తడం, యోగా, సైక్లింగ్, జాగింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. 

412

పలు పరిశోధనల ప్రకారం.. నిత్యం వ్యాయామం చేయడం వల్ల  Blood circulation మెరుగుపడి.. బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే రాదు.

512

చక్కెరతో తయారుచేసిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. మధుమేహులు వీటిని పూర్తిగా తినకపోవడమే మంచిది. 
 

612

ముఖ్యంగా వీరు ప్రతి రోజూ నిర్ణీత సమయానికే తినాలి. అలాగే సమయానుకూలంగా తింటూ ఉండాలి. ముఖ్యంగా మీరు తినే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉండాలి. 
 

712
diabetes diet

మీ రోజు వారి ఆహారంలో 400 నుంచి 500 గ్రాముల కూరగాయలు ఉండేట్టు చూసుకోవాలి. అలాగే చిరుధాన్యాలను కూడా తింటూ ఉండాలి. రోజూ ఒకే రకమైనవి కాకుండా కొన్నింటిని కలిపి తీసుకోండి. 

812

మధుమేహులు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. ఈ పిండి పదార్థాల వల్ల షుగర్ లెవెల్స్ పెరగుతాయి. కాబట్టి వీటిని తినడం తగ్గించండి. 

912

డయాబెటీస్ పేషెంట్లకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అన్నాన్ని తక్కువగా తీసుకుని రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలను తినండి. 

1012

అలాగే కీరదోస, టొమాటోలు, క్యారెట్ , బీట్ రూట్ వంటి కూరగాయలను ఉడికించకుండా పచ్చిగానే తినడం అలవాటు చేసుకోండి. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ లో ఉదయం ఏదైనా కూరగాయల జ్యూస్ ను తాగండి. ఇక మధ్యాహ్నం సమయంలో కూరగాయల సలాడ్, రాత్రి పండ్లను తీసుకోండి.  ఇలా చేస్తే మీరు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోలేరు. దీంతో ఆటోమెటిక్ గా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 
 

1112

గ్రీన్ టీ తాగితే కూడా రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి.  ఈ గ్రీన్ టీ ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆకలిని తగ్గిస్తాయి. కాగా గ్రీన్ టీ తక్కువ ప్రాసెస్ అయి ఉంటుంది. 
 

1212

చాలా మంది నీళ్లను శరీరానికి సరిపడా తాగరు. దీంతో జీక్రియలకు ఆటంకం కలుగుతుంది. దీంతో రక్తంలోని షుగర్ లెవెల్స్ ఇట్టే పెరుగుతాయి. కాబట్టి మీ బాడీకి అవసరమయ్యే నీళ్లను తాగుతూ ఉండండి. ఇది Metabolism కు ఉపయోగపడుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ నియంత్రించబడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories