Protein Foods: నాన్ వెజ్ ఎక్కువగా తింటే మగాళ్లలో అది తగ్గుతుంది జాగ్రత్త..

Published : Apr 05, 2022, 12:49 PM IST

Protein Foods: గుడ్లు, చికెన్, మటన్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో కదా.. వారానికి రెండు మూడు సార్లు తినడానికి కూడా వెనకాడరు. కానీ వీటిని ఎక్కువగా తింటే స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గుతుందని అధ్యనాలు హెచ్చరిస్తున్నాయి. 

PREV
18
Protein Foods: నాన్ వెజ్ ఎక్కువగా తింటే మగాళ్లలో అది తగ్గుతుంది జాగ్రత్త..

Protein Foods:గుడ్లు,  చికెన్, మటన్ లను తినని వారు చాలా తక్కువ. ఈ ఫుడ్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రోటీన్ లోపం ఏర్పడకుండా వీటిని తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే నాన్ వెజ్ ను మోతాదుకు మించి లాగిస్తే మాత్రం మగాళ్లకు అస్సలు మంచిది కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 

28

ముఖ్యంగా పిల్లలకోసం ప్లాన్ చేసుకునేవాళ్లు నాన్ వెజ్ ను ఎక్కువగా తినకూడదని చెబుుతన్నారు. ప్రోటీన్లు లోపించకూడదని నాన్ వెజ్ ను ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయాలు వెలువడ్డాయి.

38

University of Worcester కు చెందిన పరిశోధన ప్రకారం.. ప్రోటీన్ ఫుడ్ న ఎక్కువగా తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పై చెడు ప్రభావం పడుతుందట. దీంతో ఈ హార్మోన్ లెవెల్స్ 37 శాతం తగ్గిపోతాయి. దీనినే హైపోగోనాడిజం అంటారట. 

48

ఈ సమస్య బారిన పడితే శుక్రకణాల సంఖ్య చాలా తగ్గుతుందట. దీంతో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకుడు, పోషకాహార నిపుణుడైన జో విట్టేకర్ పేర్కొన్నారు. 

58

టెస్టోస్టెరన్ తగ్గితే  హార్ట్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సి వస్తదని హెచ్చిరించారు.

68

దీనికి తోడు కండలను పెంచడానికి, బాడీ ఫిట్ గా ఉండాలని ప్రోటీన్ షేక్ లను ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. ఈ ప్రోటీన్ షేక్స్ ను ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

78

బాడీలో ప్రోటీన్లు ఎక్కువైతే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వీటిని బట్టే ప్రోటీన్ ను మీరు అధికంగా తీసుకుంటున్నారని గుర్తించాలి. 

88

రెండు వారాలకు 35 శాతం ప్రోటీన్ ను తీసుకుంటే చాలు. ఇంతకు మించి ప్రోటీన్ తీసుకుంటే లేనిపోని రోగాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్ వెజ్ ను మోతాదుగానే తినండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories