Diabetes: మధుమేహులు రాత్రిపూట పాలు తాగకూడదా?

First Published Jul 1, 2022, 3:29 PM IST

Diabetes: మధుమేహులు తాగే, తినే ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాగా వీళ్లు రాత్రిపూట పాలు తాగడం వీరి పాణానికి ఏ మాత్రం మంచది కాదని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. ఎందుకంటే.. 

మన దేశంలో చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ అనారోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. డయాబెటీస్ ను నయం చేసే చికిత్స లేదు. అందుకే మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు తమ రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అత్యవసరం. 

కాగా కొంతమంది మధుమేహులు ఏది పడితే అది తింటూ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. అందుకే వీరు ఏమి తినాలి ఏవి తినకూడదు వంటి విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా వీరు పాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

పాలు సంపూర్ణ ఆహారం కిందికి వస్తుంది. అయినప్పటికీ మధుమేహులు పాలను కొన్ని సందర్భాల్లో తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట? దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అలాగే దీనిలో లాక్టోస్ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మధుమేహులు పాలను తాగాలా? వద్దా? అని ఆలోచిస్తుంటారు. 
 

డయాబెటీస్ పేషెంట్లకు కార్బోహైడ్రేట్లు అంత మంచివి కావు. ఇక పాలలో ఉండే లాక్టోస్  శరీరంలోకి వెళ్లి చక్కెరగా మారుతుంది. ఈ చక్కెర కాస్త రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచుతుంది. అందుకే పాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 
 

పాలలోని లాక్టోస్ చక్కెర మారి.. రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు రాత్రి పూట పాలను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట లాక్టోస్ విచ్ఛిన్నమైనప్పుడు శరీరం తనకు లభించే శక్తిని ఉపయోగించుకోలేదు. అందుకే పాలను రాత్రిపూట కాకుండా ఉదయం  బ్రేక్ ఫాస్ట్ లో తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువ మొత్తంలో ఉంటుంది. దాంతో శరీరానికి శక్తి లభిస్తుంది. 

మధుమేహులకు కాకుండా ఇతరులకు రాత్రిపూట పాలు తాగడం వల్ల బోలేడు ప్రయోజనాలున్నాయి. రాత్రి పూట పాలను తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి తాగితే ఇంకా మంచి జరుగుతుంది. ఈ పసుపు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.

দারুচিনি

పాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయా

పాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఎందుకంటే పాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు ఆవు పాలలో.. కొవ్వు - 7 గ్రా, కేలరీలు - 152 గ్రా, కార్బోహైడ్రేట్లు - 12 గ్రా ఉంటాయి.
 

ఒకవేళ మధుమేహులు పాలు తాగినా అందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. కాగా ఆవు పాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచవు.  సోయా పాలు, బాదం పాలు, అవిసె పాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని కూడా మధుమేహులు తాగొచ్చు. 

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఎంత పరిమాణంలో పాలను తాగాలి:  సాధారణంగా మధుమేహులు రోజుకు 3 కప్పుల పాలను ఎలాంటి భయాలు లేకుండా తాగొచ్చు. అయితే ఒక కప్పు పాలను తాగిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పెరిగితే పాలను ఇంకిన్ని తాగకపోవడమే మంచిది. 
 

click me!