షుగర్ పేషెంట్లు బియ్యం, గోధుమ వినియోగాన్ని తగ్గిస్తేనే మంచిది.. ఎందుకంటే..?

Published : Sep 01, 2022, 09:54 AM IST

డయాబెటీస్ పెషెంట్లు బియ్యం, గోధుమల వినియోగాన్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం పెంచాలని ఐసీఎంఆర్ కొత్త అధ్యయనం వెల్లడించింది. 

PREV
18
షుగర్ పేషెంట్లు బియ్యం, గోధుమ వినియోగాన్ని తగ్గిస్తేనే మంచిది.. ఎందుకంటే..?

జనాభా ఆధారిత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఇండియా డయాబెటిస్ (ICMR-INDIAB) అధ్యయనం.. ఈ మధ్యే డయాబెటీస్ బారిన పడ్డ వాళ్లకు, ప్రీడయాబెటీస్ కోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుందని చెబుతోంది. డయాబెటీస్ కేర్ జర్నల్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. కొత్తగా నిర్దారణ అయిన డయాబెటీస్ పెషెంట్లు 55 శాతం కార్బ్ వినియోగాన్ని తగ్గించాలని సిఫారసు చేస్తోంది. అలాగే 25 ప్రోటీన్ ను, 25 శాతం కొవ్వును పెంచాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. 
 

28
diabetes diet

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో 70 శాతం కంటే ఎక్కువే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి పిండి పదార్థాలను తగ్గించి మొక్కలు, జంతు ప్రోటీన్ల శాతాన్ని పెంచాలని ఈ అధ్యయనం మధుమేహులకు సూచిస్తోంది. 

38

అలాగే ప్రీడాబెటీస్ కోసం ఈ అధ్యయనం కార్బోహైడ్రేట్లను 56 శాతం తగ్గించి 27 శాతం కొవ్వును, 20 శాతం ప్రోటీన్ ను తీసుకోవడం పెంచాలని తెలియజేస్తుంది.. ఈ అధ్యయనాన్ని మొత్తం 18,090 మంది వయోజనులపై చేశారు. 
 

48

ఇకపోతే షుగర్ వ్యాధిని నియంత్రించాలంటే తెల్లబియ్యం వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాలని చెబుతున్నారు. అలాగే మధుమేహులకు గోధుమలు కూడా మంచివి కావని ఈ అధ్యయనంలో ఒకరైన డాక్టర్ వి మోహన్ మీడియాతో వెల్లడించారు. 
 

58

అయితే మధుమేహుల ఆరోగ్యానికి రెడ్ మీట్ కూడా మంచిది కాదు. వీటికి బదులుగా చేపలు, చికెన్, మొక్కల ప్రోటీన్ ను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.

68
Tips for control diabetics

మీకు తెలుసా..? మన దేశంలో ప్రస్తుతం 74 మిలియన్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక  ప్రీడయాబెటీస్ తో మరో 80 మిలియన్ల మంది బాధపడుతున్నారు. ఇది 2009లో 7.1 శాతంగా ఉంటే 2019 లో 8.9 కు పెరిగిందంటే ఇది ఏ విధంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోండి. ప్రీ డయాబెటీస్ చాలా ఫాస్ట్ గా డయాబెటీస్ గా మారుతోంది. 2045 నాటికి ఇండియాలో 135 మిలియన్ల డయాబెటీస్ పేషెంట్లు ఉంటారని అంచనా.. మన దేశంలో ఇప్పుడున్న డయాబెటీస్ పేషెంట్లలో 12.1 మిలియన్ల మందంతా 65 ఏండ్ల వారే కావడం గమనార్హం. ఇక 2045 నాటికి ఈ సంఖ్య 27.5 మిలియన్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 
 

78

ఊబకాయం, చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవన శైలి, జన్యుపరంగా, తక్కువ నిద్ర, కాలుష్య కారకాలు, అనియంత్రిత రక్తపోటు, ఒత్తిడి, అనియంత్రిత కొలెస్ట్రాల్ వంటివి మధుమేహానికి దారితీస్తాయి. 

88
diabetic control

మధుమేహం వల్ల వ్యాస్కులర్ వ్యాధుల  ప్రమాదం పెరుగుతుంది. 2021లో చేసిన ఒక పరిశోధన అధ్యయనం ప్రకారం..టైప్ 2 డయాబెటీస్ వల్ల మాక్రోవాస్కులర్, డయాబెటీస్ రెటినినోపతి, సెరెబ్రోవాస్కులర్, నెఫ్రోపతి వంటి వ్యాధులు వస్తాయని తేల్చి చెప్పింది. పలు పరిశోధనల ప్రకారం.. మధుమేహం మానసిక ఆరోగ్యం, కాలెయ వ్యాధి, వైకల్యం, క్యాన్సర్ వంటి ప్రమాదాలతో ముడి పడి ఉందని వెల్లడించాయి. 

Read more Photos on
click me!

Recommended Stories