ఇక ఈ రోజున చిన్నవారి నుంచి పెద్దవారి వరకు గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. 11 రోజులు జరుపుకునే ఈ పండుగను చిన్న చిన్న వీధిలో నుండి పెద్ద పెద్ద నగరాల వరకు దేవుడిని ప్రతిష్టించి అంగరంగా వైభవంగా వేడుకలు జరుపుకుంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ పండుగ రోజు కొన్ని తప్పనిసరి పాటించాల్సిన నియమాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండుగ రోజు చంద్రుడిని అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఓసారి చంద్రుడు గణపయ్య రూపాన్ని చూసి నవ్వటంతో వెంటనే గణపయ్య చంద్రుడికి శాపం విధిస్తాడు. ఇక ఆ శాపంతో ఇప్పటికీ ప్రజలు పండగ రోజు చంద్రుడిని చూడరు.
ఇక మరొకటి వినాయక చవితి రోజు ఇంట్లో ఎలుక కనిపిస్తే కొన్ని శుభాలు, కొన్ని అశుభాలు ఉంటాయని తెలుస్తుంది. అదేంటి వినాయకుడి వాహనమైన ఎలుక కనిపిస్తే అశుభాలు ఎందుకు జరుగుతాయి అని అనుకుంటున్నారా.. కచ్చితంగా కొన్ని అశుభాలు జరుగుతాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.
Ganesh Chaturthi 2022
ఇంతకు అవేంటంటే.. వినాయక చవితి రోజు మీ ఇంట్లో నుంచి ఎలుక బయటకు వెళ్తుండగా మీ కంట పడినట్లయితే అది శుభసూచకం. మీ పేదరికం, కష్టాలన్నీ తొలగిపోతాయనే దానికి సంకేతం. అంతేకాకుండా మీ ఇంట్లో సంతోషం నెలకొంటుందని అర్థం. ఇక తెల్ల ఎలుక మీకు కనిపించినా కూడా శుభసూచకమే. తెలుపు సానుకూలతకు చిహ్నం.
Ganesh Chaturthi 2022
తెల్ల ఎలుక కనిపిస్తే మీకు రాబోయే కాలంలో అంత మంచే జరగబోతుందని అర్థం. గణేశ్ పండుగ రోజు నిద్ర లేవగానే ఎలుకను చూడటం మాత్రం అశుభమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. గణేశ్ చతుర్థి నాడు ఎలుకను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. తరిమికొట్టవచ్చు కానీ చంపకూడదు. ఒకవేళ చంపితే మీ ఇంట్లో ఎవరి ఆరోగ్యమైనా క్షీణించవచ్చు. భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వినాయక చవితి రోజు ఎలుకను చంపకుండా బయటికి పంపించడం ఉత్తమం.