AC Risk: ఎండలో బయటకు వెళ్లిన తర్వాత.. వెంటనే ఏసీలోకి వెళ్తే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. స్వర్గంలోకి అడుగుపెట్టామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ.. అలా ఒక్కసారిగా మీ చుట్టూ ఉన్న టెంపరేచర్ మారడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మీకు తెలుసా?
బయట ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఎండలను తట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఒక్కసారి ఏదైనా పని మీద బయటకు వెళ్లినా.. ఎప్పుడెప్పుడు నీడలోకి వస్తామా? ఏసీ లోకి అడుగుపెడతామా అని చాలా మంది ఎదురు చూస్తారు.
అంతేకాదు.. వెంటనే ఇంటికి రాగానే.. ఏసీ ఆన్ చేసుకొని ఆ ఏసీలో కూర్చుంటారు. కానీ.. ఎండ నుంచి లోపలికి రాగానే వెంటనే ఏసీలోకి అడుగుపెట్టడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
24
మన శరీరం ఎలా పని చేస్తుంది?
సాధారణంగా మన శరీరం బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా తనను తాను సరద్దుబాటు చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. మనం ఎండలో ఉన్నప్పుడు చెమట పట్టడం, రక్త నాళాలు వ్యాకోచించడం వంటి ప్రక్రియల ద్వారా శరీరం తన ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుకుంటుంది. ఇది మన శరీరంలో సహజంగా ఉండే ఒక రక్షణ వ్యవస్థగా పని చేస్తుంది.
34
ఏసీలోకి ఎందుకు వెళ్లకూడదు...?
ఎండలోంచి వచ్చిన వెంటనే అకస్మాత్తుగా అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏసీ గదిలోకి వెళ్లినప్పుడు, మన శరీర సహజ రక్షణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. ఉష్ణోగ్రతలో కలిగే ఈ ఆకస్మిక మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఇది మన రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది.
ఎండ నుంచి ఇంటికి లేదా ఆఫీస్‌కు వచ్చిన వెంటనే కాసేపు నీడలో లేదా ఫ్యాన్ కింద కూర్చోవాలి. శరీర ఉష్ణోగ్రత కాస్త సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే ఏసీ గదిలోకి వెళ్లడం సురక్షితం. అలాగే, ఏసీ గదిలోకి వెళ్లే ముందు బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. ఇలా కొద్దిసేపు ఆగి వెళ్లడం ద్వారా మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.