Walking: రోజుకి ఎంత దూరం నడవాలి?

Published : Mar 11, 2025, 02:07 PM IST

ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. అయితే.. ఎవరు ఎంత వరకు నడవాలి అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి.  

PREV
16
Walking: రోజుకి ఎంత దూరం నడవాలి?

శరీరానికి తగినంత వ్యాయామం చాలా అవసరం. దానికోసం ప్రతి ఒక్కరూ కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యం కాదు. కానీ.. ప్రతి ఒక్కరూ సులభంగా చేయగలిగిన వ్యాయామం ఏదైనా ఉంది అంటే అది నడక మాత్రమే. రెగ్యులర్ గా వాకింగ చేయడం వల్ల .. ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ.. ప్రతి ఒక్కరూ తమ వయసును బట్టి మాత్రమే వాకింగ్ చేయాలి. మరి,  ఏ వయసు వారు ప్రతిరోజూ ఎంత దూరం నడవాలో, నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

 

26

పెద్దవాళ్లు నడవాల్సిన దూరం:..

పెద్దవాళ్లు రోజుకి 10,000 అడుగులు, అంటే దాదాపు 8 కిలోమీటర్లు నడవాలి. ముఖ్యంగా 25 ఏళ్లు దాటిన వారందరూ రోజూ ఎనిమిది కిలో మీటర్లు నడవడం  వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లు తమకు వీలైనంత వరకు నడవాలి. ఇంత దూరం నడవాలి అని రూల్ ఏమీ లేదు.  కానీ కచ్చితంగా ప్రతిరోజు నడవాలని నిపుణులు చెప్తున్నారు.

36

వయసుకి తగ్గ వాకింగ్:

6–17 ఏళ్ల పిల్లలు: పిల్లలు చురుకుగా ఉండాలి. రోజుకి కనీసం 60 నిమిషాలు బాగా ఉత్సాహంగా ఆడుకునేలా చూడాలి. వాకింగ్ మాత్రమే కాదు.. డ్యాన్స్, బ్యాడ్మింటన్ లాంటివి ఏవైనా కూడా చేయవచ్చు.

46

పెద్దోళ్లు:

రోజుకి 10 వేల అడుగులు లేదా 8 కిలోమీటర్లు నడవాలి. ఇంత పెద్ద టార్గెట్ ఒక్కరోజులోనే రీచ్ అవ్వక్కర్లేదు. నెమ్మదిగా ట్రై చేయొచ్చు. అంటే 1000 అడుగులతో మొదలుపెట్టి మెల్లగా పెంచొచ్చు. 

 

56
ముసలివాళ్లు:

రోజుకి దాదాపు 1 నుంచి 3 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుని నడవొచ్చు. మాగ్జిమమ్ 4 కిలోమీటర్ల వరకు నడవొచ్చు. కనీసం ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు అటూ ఇటూ నడవాలి. దీనివల్ల పాత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  ఆరోగ్యంగా ఉంటారు.

 

66
నడక వల్ల ఉపయోగాలు:

- చెడు కొవ్వు కరిగి బరువు కంట్రోల్ లో ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది సులువైన, మంచి వ్యాయామం. 

- హై బీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

- ఎముకలు గట్టిపడతాయి. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

- డిప్రెషన్ తగ్గి టెన్షన్ రాకుండా చేస్తుంది. మూడ్ ని చక్కగా ఉంచుతుంది. 

- సాయంత్రం, రాత్రిపూట నడిస్తే నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది. మంచి నిద్ర పడుతుంది. 

- షుగర్ పేషెంట్లు ప్రతిరోజు నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది. 

- కాలు కండరాలు బలంగా అవుతాయి. చీలమండలు, మోకాళ్లు గట్టిపడతాయి. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి తగ్గుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories