ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు ఆచరించదగినవి. ప్రస్తుత జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాలామంది చాణక్యుడి నీతి సూత్రాలను ఇప్పటికీ ఫాలో అవుతుంటారు. చాణక్య నీతి ప్రకారం మనిషి జీవితంలో కొన్ని విషయాలను ఎవరితో పంచుకోకూడదు. అవెంటో? ఎందుకో ఇప్పుడు చూద్దాం.
ఆచార్య చాణక్యుడు తన జ్ఞానం, బోధనలు, సూత్రాలతో నేటికీ ప్రసిద్ధి. చాణక్యుడి నీతి సూత్రాలను ఫాలో అయ్యేవారు జీవితంలో వెనక్కి తిరిగి చూడరని అంటారు. చాలామంది వాటిని ఇప్పటికీ ఆచరిస్తుంటారు కూడా. జీవితానికి ఎంతగానో ఉపయోగపడే విషయాలను ఆయన తన బోధనల్లో వివరించాడు. చాణక్యుడి నీతి ప్రకారం కొన్ని విషయాలను ఇతరులతో అస్సలు పంచుకోకూడదు. అవెంటో ఇప్పుడు చూద్దాం.
26
ఏ విషయాలు ఇతరులకు చెప్పొద్దు?
ఒక వ్యక్తి జీవితంలో మంచి, చెడు, కష్టం, నష్టం, సుఖం ఇలా చాలా విషయాలు ఉంటాయి. అన్నీ విషయాలు అందరితో పంచుకోరు. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు ఇతరులతో పంచుకోకూడదని చెబుతోంది చాణక్య నీతి. మరి ఏ విషయాలను ఇతరుల నుంచి దాచిపెట్టాలో ఇప్పుడు చూద్దాం.
36
వివాహ జీవితం
చాణక్య నీతి ప్రకారం వివాహ జీవితం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ, శ్రద్ధ, అభిప్రాయభేదాలు కలిగిన అంశం. రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఇతరులతో పంచుకుంటే నష్టపోతారు.
46
సంపద
ఆచార్య చాణక్యుడి ప్రకారం సంపద, ఆదాయం గురించి ఎవరికీ చెప్పకూడదు. మీ ఆదాయాన్ని దాచి ఉంచాలి. ఇలాంటి విషయాలను ఇతరులకు చెప్పుకోవడం ద్వారా మీకు హాని తలపెట్టే ప్రమాదం ఉంటుంది.
56
వయసు
ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం వయస్సు గురించి ఎవరికీ చెప్పకూడదు. వయసు దాచి ఉంచాలని ఆయన బోధనల్లో పేర్కొన్నాడు. ఎందుకంటే శత్రువులు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
66
రహస్య దానం
చాణక్య నీతి ప్రకారం గురువు ఒకరికి ఏదైనా ప్రత్యేక మంత్రం లేదా జ్ఞానాన్ని ఇస్తే, దాన్ని వేరే ఎవరికీ చెప్పకూడదు. దానం పుణ్యకార్యమే అయినా, ఇతరుల ముందు చెప్పకూడదు.