సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే 'X'లో @JustPunforfun అనే యూజర్ దోశ పిండి రెసిపీని షేర్ చేశారు. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీ వంటగదిలోనే సిద్ధంగా ఉంటాయి. బయటి నుంచి ఏమీ కొనాల్సిన పనిలేదు. ఈ పిండి త్వరగా రెడీ అవ్వడమే కాకుండా, దీనితో చేసే దోశలు క్రిస్సీగా వస్తాయి.
ఇన్‌స్టంట్ దోశ పిండి తయారు చేయడానికి ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు సామలు తీసుకోవాలి. అలాగే రెండు ఉడికించిన బంగాళదుంపలు, రెండు పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకులు, చిటికెడు ఇంగువ, ఒక చెంచా వాము, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.