Broccoli Dosa: దోశ ఎంతో మంది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్. అయితే దీన్ని మరింత టేస్టీగా, హెల్తీగా చేయాలనుకుంటే బ్రొకోలీని కలపండి. బ్రొకోలీ దోశ క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దాని రెసిపీ తెలుసుకోండి.
బ్రొకోలీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ పిల్లలు దాన్ని ఇష్టంగా తినరు. ఒకే రకమైన దోశలు తిని బోర్ కొట్టిన వారికి బ్రొకోలీ దోశ చాలా రుచిగా ఉంటుంది బ్రోకోలిని కలిపి చేసే దోశ కరకరలాడే రుచితో పాటూ ఈ రెసిపీని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా కూడా లాగించేయొచ్చు.ఈ రెసిపీ ఎలాగా చేయాలో ఇక్కడ ఇచ్చాము.
23
బ్రొకోలీ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దోశ పిండి – 2 కప్పులు
బ్రొకోలీ తురుము - 1 కప్పు
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2 టీస్పూన్
మిరియాల పొడి - 1/4 టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
నూనె - సరిపడా
33
బ్రొకోలీ దోశె రెసిపీ
ముందుగా బ్రొకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంచేసుకోవాలి. వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో బ్రొకోలీ ముక్కలను 2-3 నిమిషాలు ఉంచి ఆ తరువాత నీటిని వడకట్టాలి.
ఇప్పుడు బ్రొకోలీ, పచ్చిమిర్చి, అల్లం మిక్సీలో వేసి ఎక్కువ నీళ్లు పోయకుండా బరకగా రుబ్బుకోండి.
పెనం స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. ఒక గరిటె పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి, సాధారణ దోశలాగే పల్చగా గుండ్రంగా రుద్దుకోవాలి.
అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేసి, అడుగు భాగం బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. ఆ తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
దోశ కరకరలాడాలంటే పల్చగా వేసి, మీడియం మంటపై కాస్త ఎక్కువసేపు ఉంచండి. వేడివేడి దోశను కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ లేదా కారం చట్నీతో వడ్డిస్తే రుచి అదిరిపోతుంది.