మొక్కజొన్నను ఇలా తింటే తెల్లజుట్టు నల్లగా మారడమే కాదు.. జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది..

Published : Aug 06, 2022, 01:04 PM IST

ఈ సీజన్ లో మొక్కజొన్నలు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని తినడం వల్ల జుట్టు పొడుగ్గా పెరగంతో తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఇంతేకాదు  మొక్కజొన్న ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది కూడాను.   

PREV
16
 మొక్కజొన్నను ఇలా తింటే తెల్లజుట్టు నల్లగా మారడమే కాదు.. జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది..

మొక్క జొన్న రుచిగానే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అందులోనూ దీనిని తొందరగా తయారుచేసుకుని తినొచ్చు. ఇక వర్షాలు పడుతుంటే.. పట్టణాల్లో వీధి వీధినా మొక్కజొన్నల బండి దర్శణమిస్తుంది. చల్లని చిరు జల్లులు పడుతుంటే.. నిప్పులపై కాల్చిన మొక్కజొన్నపై నిమ్మకాయ, ఉప్పును పెట్టి తింటుంటే వచ్చే ఆ మజాయే వేరుకదా.. అయినా ఈ సీజన్ లో ఈ మొక్కజొన్నను తినని వారెవ్వరూ ఉండరు.  

26

వర్షాకాలంలో వేడి వేడి ఫుడ్ ఐటమ్స్ నే తినడానికి ఇష్టపడతారు చాలా మంది. అందులో మొక్కజొన్నను తినడం ఇంకా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వర్షాకాలంలో మొక్కజొన్నలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

36

మొక్కజొన్నను తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందని రుజువు చేయబడింది. ఎందుకంటే మొక్కజొన్న జుట్టు ఆరోగ్యంపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొక్క జొన్నను తినడం వల్ల జుట్టు తెల్లబడటం ఆగుతుంది. అలాగే పొడుగ్గా కూడా పెరుగుతుంది. 
 

46

మొక్కజొన్నలో ఉండే పీచుపదార్థం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణంగా వర్షకాలంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతారు. అయితే మొక్కజొన్నను తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణసమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఒకరకంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందనే చెప్పాలి. 
 

56

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి కూడా మొక్కజొన్న ఎంతో సహాయపడుతుంది. అందుకే మధుమేహులు వీటిని మితంగా తీసుకుంటే మంచి జరుగుతుంది. మొక్కజొన్నను ఉడకబెట్టి లేదా కాల్చి లేదా రొట్టెలుగా చేసుకుని తినొచ్చు. కానీ సాధారణంగా మార్కెట్ లో లభించే మొక్కజొన్నకు మాత్రమే ఈ లక్షణాలున్నాయని.. అమెరికన్ మొక్కజొన్న, పాప్ కార్న్ లకు ఈ లక్షణాలు లేవని నిపుణులు చెబుతున్నారు. 

66
corn

వర్షాకాలంలో వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం చాలా అవసరం. ముఖ్యంగా మాన్ సూన్ డైట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందుకే వర్షాకాలంలో తినదగిన ఆహారాలను మాత్రమే తినాలి. ఏవి పడితే అవి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories