Kitchen Tips: ఈ కిచెన్ ట్రిక్స్ తెలిస్తే చాలు..పాడైన వంటను కూడా నిమిషాల్లో రుచిగా మార్చేయొచ్చు

Published : Nov 11, 2026, 04:09 PM IST

Kitchen Tips: ఒక్కోరోజు ఇంటి పని హడావిడిలో కూరలు మాడిపోవడం, అన్నం మెత్తగా అయిపోవడం, చపాతీలు మాడిపోవడం...ఇలా జరుగుతుంటాయి. మిస్టేక్స్ జరుగుతుంటాయి కాబట్టి...పాడైపోయిన వంటలను కూడా చిన్న చిన్న చిట్కాలతో మ్యాజిక్ చేయొచ్చు.

PREV
16
వంట పాడైందని పారేస్తున్నారా?

ఇంటి పనుల హడావిడిలో ఒక్కోసారి వంటలు అనుకున్నట్లు రావు. కూరలు అడుగంటిపోవడం, అన్నం మరీ మెత్తగా మారడం, చపాతీలు మాడిపోవడం ఇలా ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది ఆ వంటలను పారేస్తుంటారు. కానీ చిన్న చిన్న కిచెన్ చిట్కాలు పాటిస్తే పాడైపోయిన వంటలను కూడా తిరిగి రుచిగా మార్చుకోవచ్చు. మాడిపోయిన కూరలో మాడిన వాసన పోగొట్టడం నుంచి, మెత్తటి అన్నాన్ని పొడిపొడిగా మార్చడం వరకు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇకపై వంట పాడైందని బాధపడాల్సిన అవసరం ఉండదు.

26
కాకరకాయ ఇష్టం లేని వాళ్లు లాగించేస్తారు

చాలా మందికి కాకరకాయ అంటే నచ్చదు. చేదుగా ఉంటుందని తినరు. కానీ కాకరకాయలో బోల్డన్ని ఔషధ గుణాలున్నాయి. చేదుగా ఉంటే తినలేకపోతే ఈ ట్రిక్ ట్రై చేయండి. కాకరకాయను ముక్కలుగా కోసి దాంట్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పిండితే...చేదు మొత్తం ఆ నీళ్ల రూపంలో పోతుంది. అప్పుడు చేదుగా ఉంటే కాకరకయ కూడా కమ్మగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్లు కూడా ఇష్టంగా తింటారు.

36
అన్నం మెత్తగా అయిపోతే కాస్త నిమ్మరసం వేయండి

ఒక్కోసారి ఏదో కంగారులో ఉండి పొయ్యి మీద అన్నం ఉడుకుతున్న సంగతి మర్చిపోతాం. అసలే ఈ ఫోన్లలో రీల్స్ చూస్తూ అన్నం అండుగంటిపోతుంది. లేదంటే మెత్తగా అయిపోతుంది. అన్నం మెత్తగా అయిపోతే చాలా మందికి నచ్చదు. కాబట్టి అన్నం దించేటప్పుడు నిమ్మ రసం వేస్తే...అన్నం అంటుకోకుండా విడివిడిగా వస్తుంది.

46
కూరలో ఉప్పు ఎక్కువైందా?

ఒక్కోసారి కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కంగారుపడకండి. బంగాళా దుంప ముక్కల్ని కోసి వేయండి. ఆ ఉప్పుని బంగాళాదుంప పీల్చుకుంటుంది. అప్పుడు కూర మొత్తం ఇంకా రుచిగా మారుతుంది.

56
ఈ ట్రిక్ తో చపాతీలు మెత్తగా వస్తాయి

వంటింట్లో చాలా మందికి ఎదురయ్యే సమస్య..చపాతీ. ఇనుప పెనం మీద చపాతీలు వేసేటప్పుడు అంటుకుని చిరిగిపోతుంటాయి. అలాంటప్పుడు చపాతీలు చేసేటప్పుడు పెనం మీద కాస్త పిండి వేసి క్లాత్ తో తుడవాలి. అప్పుడు చపాతీ బాగా పొంగి మెత్తగా వస్తాయి.

66
ఇలా చేస్తే పకోడీలు క్రిస్పీగా వస్తాయి

పకోడీలు చేసేటప్పుడు క్రిస్పీగా రావాలంటే శనగపిండి కలిపేటప్పుడు స్పూన్ మరిగే నూనె వేయాలి. అప్పుడు పకోడీలు నూనె పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories