Constipation Remedies: మలబద్దకం ఈ కారణాల వల్ల కూడా వస్తుంది.. లైట్ తీసుకోకండి..!

Published : Aug 18, 2022, 02:53 PM IST

Constipation Remedies: మలబద్దకం చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. దీన్ని లైట్ తీసుకోకూడదు. దీనివల్ల ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

PREV
19
 Constipation Remedies: మలబద్దకం ఈ కారణాల వల్ల కూడా వస్తుంది.. లైట్ తీసుకోకండి..!

మన శరీరం.. మనం తినే ఆహారం నుంచి అవసరమైన పదార్థాలను తీసుకుని..  ఆ తర్వాత వేస్ట్ పదార్థాలను విసర్జిస్తుంది. జీర్ణవ్యవస్థ చివరి ప్రక్రియే ఈ విసర్జన. అయితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ రకమైన సమస్యలైనా కూడా విసర్జన సమస్యలను కలిగిస్తాయి.

29

ఈ రకమైన సమస్యలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అయితే మలబద్దకం సమస్య అయితే కొన్ని చిట్కాల ద్వారా పోతుంది. ఏం చేసినా ఈ సమస్య తగ్గకపోతే డాక్టర్ ను పక్కాగా సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు సలహానిస్తున్నారు. అయితే మలబద్దకం సమస్య తరచుగా రావడానికి కారణాలు ఇవే..

39

మన తీసుకునే కొన్ని రకాల ఆహారాలు కూడా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు కారణమవుతాయి. ఈ విధంగా కూడా మలబద్ధకం కలగొచ్చు.  పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం, పీచు పదార్థాలను తక్కువగా తీసుకోవడం, మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడతారు. 

49

శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం వల్ల కూడా మలబద్దకం సమస్య బారిన పడొచ్చు. ఎందుకంటే శరీరంలో సరిపడా నీరు లేకపోతే.. జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది మలబద్దకానికి దారితీస్తుంది. అందుకే రోజుకు ఒక వయోజనుడు పక్కగా మూడు లీటర్ల నీటిని తాగాలి.
 

59
Alcohol

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగే వారిలో కూడా ఈ మలబద్దకం సమస్య వస్తుంది. మలబద్ధకం మాత్రమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. 

69

శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అందుకే రోజూ సాధ్యమైనన్ని ఎక్కువ పనులను చేయడానికి ప్రయత్నించండి. వ్యాయామం చేయండి. వీటి వల్ల మీ శరీరం బాగా కదులుతుంది. అప్పుడు ఎలాంటి సమస్యలు రావు. 

79

డయాబెటిస్ ఉన్నవారిలో మలబద్ధకం  సమస్య సాధారణం. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో నరాల దెబ్బతినడంతో ఈ సమస్య వస్తుంది. 

89
hypothyroidism

హైపోథైరాయిడిజం లేదా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు మలబద్ధకం బారిన పడతారు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

99

మానసిక ఆరోగ్యానికి,కడుపు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి. మనసు బాగోలేనప్పుడు కడుపు కూడా కలత చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మూడ్ డిజార్డర్ ఉన్నవారిలో ఈ రకమైన మలబద్ధకం సమస్య సర్వ సాధారణం.
 

Read more Photos on
click me!

Recommended Stories