1. జుట్టురాలే సమస్యకు మెంతులతో చెక్ పెట్టొచ్చు.
మెంతులను కొబ్బరి నూనెలో కలిసి వేడి చేసి చల్లారనివ్వాలి. ఆపై మీ తలకు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి.
-మనం తీసుకునే ఆహారంలోనూ మెంతులను, మెంతికూరను భాగం చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
మెంతులు నానపెట్టిన నీరు కూడా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమస్య (PCOD, మొదలైనవి) , జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.