ఇలా చేస్తే.. ముఖంపై ఒక్క మచ్చకూడా ఉండదు.. అందంగా కనిపిస్తారు కూడా

First Published Jan 24, 2023, 12:56 PM IST

మొటిమలు, మొటిమల వల్ల అయ్యే  మచ్చలు ముఖ అందాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ సమస్యలు పూర్తిగా పోవడానికి కొల్లాజెన్ మీకు బాగా సహాయపడుతుంది. కొన్ని ఫేస్ మాస్క్ లు మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని బాగా పెంచుతాయి. దీంతో మీ ముఖంపై ఒక్క మచ్చకూడా ఉండదు. రంగు కూడా పెరుగుతుంది.
 

దుమ్ము, ధూళి, పేలవమైన జీవనశైలి, కాలుష్యం, తినే ఆహారాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు, నల్లని మచ్చలు, తెల్లని మచ్చలు, కంటిచుట్టూ నల్లని వలయాలు, ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటినీ నియంత్రించడానికి కొల్లాజెన్ బాగా సహాయపడుతుంది. అవును మన శరీరంలో ఇది తగినంత మొత్తంలో ఉంటే ఇలాంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. కొల్లాజెన్ అనేది శరీరంలో ఉండే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం కాపాడుతుంది. ఈ ప్రోటీన్ పెరగడానికి ఆహారాన్ని తీసుకోవచ్చు. కొన్ని ఫేస్ మాస్క్  ల ద్వారా కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. 
 

కాయధాన్యాలు, అవిసె గింజలు, నువ్వులు, పాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ లను ఉపయోగించండి. ఇవి మచ్చలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్ లో అమైనో ఆమ్లాలతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్  తగ్గకుండా చూస్తాయి. అలాగే చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలతో  ఇబ్బంది పడుతుంటే ఈ ఫేస్ మాస్క్ లను ఖచ్చితంగా ఉపయోగించండి. 
 

కొల్లాజెన్ బూస్టర్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

కాయధాన్యాలు
అవిసె గింజల
నువ్వులు
పాలు


తయారుచేసే విధానం 

ముందుగా కాయధాన్యాలు, అవిసె గింజలను, నువ్వులను బ్లెండర్ లో వేసి గ్రైండ్ చేయండి. దీన్ని పక్కన పెట్టేసి మీడియం మంట మీద పాన్ పెట్టి అందులో పాలు పోసి మరిగించండి. ఈ పాలు మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ చిక్కబడేంత వరకు దీన్ని ఉడకబెట్టండి. ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముఖానికి, చర్మానికి అప్లై చేయండి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత వేళ్లతో దీన్ని తొలగించండి. 5 నిమిషాల పాటు చర్మాన్ని నెమ్మదిగా మసాజ్ చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలొస్తాయి. అయితే మీరు బయటకు వెళ్లకపోతే మీ ముఖాన్ని నీటితో కడగకండి. ఒకవేళ వెళ్తే గోరువెచ్చని నీటితో కడగండి. 

అయితే ఫేస్ వాష్ లేదా ఇతర రకాల కెమికల్ క్లెన్సర్లను ఉపయోగించిన వెంటనే ఈ ఫేస్ మాస్క్ ను ఉపయోగించకూడదు. మీ చర్మం మరింత జిడ్డుగా కనిపిస్తే శెనగపిండి లేదా ముల్తానీ మిట్టి వంటి నేచురల్ క్లెన్సర్ లను అప్లై చేయండి. జిడ్డు తొలగిపోతుంది. 


చర్మానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమైనది

పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం..  కొల్లాజెన్ చర్మానికి అవసరమైన ప్రోటీన్. ఇది మన చర్మంలో సహజంగా ఉంటుంది. మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి ఎన్నో ఆహారాలు సహాయపడతాయి. చర్మ సంరక్షణ ఉత్పత్తులు కూడా కొల్లాజెన్ ను పెంచడానికి సహాయపడతాయి. 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. కొల్లాజెన్ శరీరం చర్మం, కండరాలు, ఎముకలు, స్నాయువులు, ఇతర బంధన కణజాలం బిల్డింగ్ బ్లాక్ గా పనిచేస్తుంది. ఇది రక్త నాళాలు, పేగు పొరలో కూడా ఉంటుంది.

కొల్లాజెన్ అమైనో ఆమ్లాల నుంచి ఏర్పడుతుంది. వీటితో పాటు కొల్లాజెన్ ను మెయింటైన్ చేయడానికి మన శరీరంలో విటమిన్ సి, జింక్, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉండాలి.
 

శరీరంలో పుష్కలంగా ఉండే కొల్లాజెన్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చర్మంపై ముడతలు, ఫినిలింగ్ వృద్ధాప్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మంపై ఉండే నల్లటి మచ్చలు, మొండి మచ్చలను పోగొడుతుంది కూడా. 

శరీరంలో కొల్లాజెన్ పుష్కలంగా ఉండటం వల్ల ఉండటం వల్ల చర్మంపై ఎలాంటి సమస్యలైనా త్వరగా నయమవుతాయి. ఇది మంటను కూడా తగ్గిస్తుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

click me!