పిల్లలు రోజుంతా ఉత్సాహంగా ఉండాలి అంటే... వారికి ఉదయం అల్పాహారం చాలా అవసరం. కాబట్టి.... వారు ఏరోజు మిస్ కాకుండా వారికి అల్పాహారం అందించాలి.
1.పన్నీర్, క్యాప్సికమ్ శాండ్ విచ్..
పన్నీర్ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకలు, దంతాలను బలం చేకూర్చడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. దానికి తోడు.. క్యాప్సికం లాంటి కూరగాయలు కూడా జత చేయడంతో... మరింత ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. పిల్లలకు శాండివిచ్ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వీటిని ఇష్టంగా తింటారు.