చలికాలంలో జుట్టు బాగా ఊడిపోతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

First Published Jan 24, 2023, 12:01 PM IST

చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో జుట్టు రాలడాన్ని ఆపొచ్చు. 
 

తీరికలేని పనుల వల్ల జుట్టు ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు చాలా మంది. దీనికితోడు చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్ లో దొరికే కెమికల్స్ ను ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే వీటికి బదులుగా సహజ ఉత్పత్తులనే వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి జుట్టు ఊడటాన్ని ఆపుతాయి. అలాగే జుట్టును బలంగా, ఒత్తుగా చేస్తాయి. ఇందుకోసం నెత్తికి ఏమేమీ అప్లై చేయాలంటే.. 

 
తేనె

తేనే నేచురల్ మాయిశ్చరైజర్. ఇది జుట్టు పెరగడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలం నుంచి పై వరకు పోషణను అందిస్తుంది. ఈ సహజ స్వీటెనర్  ను మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల గరుకుదనం, పొడి, తామర, చుండ్రు, చర్మశోథ, సోరియాసిస్, ఇతర జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. తేనెలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె, బియ్యం పాలను కలపండి. దీనిని మీ జుట్టంతా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ తేనె వల్ల మీ జుట్టు మూలాలకు పోషణ అందుతుంది. జుట్టు బలంగా ఉంటుంది. జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.
 

టీ

టీ మీ జుట్టుకు సహజ మెరుగుపును ఇస్తుంది. ఇది వింతగా అనిపించినా..ఇదే నిజముంటున్నారు నిపుణులు. జుట్టును షాంపూతో కడిగిన తర్వాత గోరువెచ్చని నీటిలో అప్పుడే చేసిన టీని కలిపి జుట్టును తడపండి. కొన్ని నిమిషాల తర్వాత అప్లై చేసి నీట్ గా కడిగేయండి. చమంతి టీ  తెల్ల జుట్టును నల్లా చేయడానికి సహాయపడుతుంది. వెంట్రుకల సహజ రంగును కాపాడుతుంది.  
 

వేడి నూనెతో మసాజ్

చలికాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు ఆరోగ్యం కోసం ఈ చిట్కాను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా చలికాలంలో జుట్టుకు నూనెను కచ్చితంగా అప్లై చేయాలి. ఇది జుట్టుకు మంచి పోషణను ఇస్తుంది. గోరువెచ్చని నూనెను వేడి చేసి జుట్టుకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే.. నెత్తిమీద తేమ ఉంటుంది. అలాగే జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణను అందిస్తుంది. 
 

అవోకాడో

అవోకాడో విటమిన్లకు గొప్ప మూలం. ఇది పొడి, దెబ్బతిన్న జుట్టును లోపలి నుంచి బలోపేతం చేస్తుంది. పండిన అరటి లేదా గుడ్డు పచ్చసొన వంటి మాయిశ్చరైజింగ్, కండిషనింగ్ పదార్ధాలతో ఈ నూనె కలిపి జుట్టుకు పెడితే జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎంచుకున్న పదార్ధాలతో కలిపిన తర్వాత మీ జుట్టుకు హెయిర్ మాస్క్  వేయండి. దీనిని 20 నుంచి 25 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ వల్ల మీ నెత్తిమీద తేమ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలడం చాలా వరకు ఆగుతాయి. 
 


కలబంద

కలబంద మీ జుట్టును సహజంగా మృదువుగా ఉంచుతాయి. కలబందలో జుట్టును మృదువుగా మార్చే సహజ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఏదైనా ఆరోగ్యకరమైన హెయిర్ ఆయిల్ తో కలిపి జుట్టుకు అప్లై చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి అలోవెరా జెల్, నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను తీసుకుని .. అన్నింటినీ ఒక చిన్న గిన్నెలో కలపండి. మీ జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పెట్టండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. తేలికపాటి షాంపూను మాత్రమే వాడండి. 
 

click me!