Healthy Drinks: కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం.. ఈ రెండింటిలో ఏది ఎండకాలంలో తాగడం మంచిది?

Published : Mar 25, 2026, 09:37 AM IST

Healthy Drinks: ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల్లో శరీరం త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. దీనికోసం కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తాగాలి. ఈ రెండింటిలో ఏది తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి.

PREV
13
ఎండాకాలంలో తాగాల్సిన పానీయాలు

మార్చిలోనే ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో వడదెబ్బ కొట్టే స్థాయికి ఎండలు తీవ్రమవుతాయి. డీహైడ్రేషన్, వడదెబ్బ, కిడ్నీ సమస్యల ప్రమాదం ఎండాకాలంలో పెరిగిపోతుంది. అందుకే ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది నీళ్లు మాత్రమే తాగుతారు. నీళ్లు తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య తగ్గదు. అందుకే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే ఆరోగ్యమో తెలుసుకోండి.

23
కొబ్బరి

కొబ్బరి నీళ్లు ఎంతో సహజమైనవ. దీన్ని ఎనర్జీ డ్రింక్‌గా పిలుస్తారు. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి  ఎలక్ట్రోలైట్స్ అందించే డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరంలోని నీటి కొరతను వేగంగా భర్తీ చేస్తాయి. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తాగినా బరువు పెరగరు.  ఎండలోంచి వచ్చాక లేదా వ్యాయామం చేశాక లేదా తేలికపాటి డీహైడ్రేషన్‌గా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక గ్లాసు లేదా 100 మిల్లీలీటర్లు కొబ్బరి నీళ్లు తాగితే సరిపోతాయి.  

ఇక నిమ్మరసాన్ని తాగినా కూడా మంచిదే.  దీన్ని ఎండాకాలంల రోజూ తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.  ఇందులో విటమిన్ సి, ఉప్పు కలిపితే సోడియం, కొద్దిగా పొటాషియం ఉంటాయి. ఇవి శరీరానికి తాగిన వెంటనే తక్షణ శక్తిని అందిస్తాయి.  అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజంతా హైడ్రేట్‌గా ఉండాలంటే నిమ్మరసం తాగాలి. 

33
రెండింటిలో ఏది మంచిది?

రోజూ ఎండలో తిరిగే వారు కచ్చితంగా కొబ్బరి నీళ్లు లేదా నిమ్మ రసం తాగడం అలవాటు చేసుకోవాలి.  హైడ్రేషన్‌ కోసం తక్కువ ఖర్చులో కావాలంటే నిమ్మరసం తాగడం బెస్ట్ ఆప్షన్. అదే ఎండలో బాగా తిరిగి డీహైడ్రేట్ అయినప్పుడు త్వరగా కోలుకోవాలంటే వెంటనే కొబ్బరి నీళ్లు తాగొచ్చు. అయితే ఈ రెండింటినీ రుచి కోసం చక్కెర కలపకుండా తాగడమే మంచిది. ప్యాకెట్లలో దొరికే రెడీమేడ్ డ్రింక్స్ తాగకూడదు.

వేసవిలో శ రీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ, మీకు డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే ORS డ్రింక్ తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, నిమ్మరసం కన్నా ఇద ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories