పొట్ట నిండా తిన్నాక ఒకటి లేదా రెండు యాలకులు నమలండి, మ్యాజిక్ జరుగుతుంది

Published : Nov 09, 2025, 08:13 AM IST

Cardamoms: యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ఒక  సుగంధ ద్రవ్యం. యాలకుల్లో విటమిన్ బి, సి, జింక్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు నిండుగా ఉంటాయి.

PREV
15
యాలకులు ఎందుకు తినాలి?

భోజనం తర్వాత యాలకులు (Cardamom) తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ చిన్న మసాలా గింజలు ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే.  వీటి నుంచి వచ్చే వాసన బిర్యానీలకు, కూరలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా యాలకులకు  జీర్ణక్రియను మెరుగుపరచడంలో, నోటి దుర్వాసన తొలగించడంలో, శరీరానికి చల్లదనాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

25
జీర్ణక్రియ

భోజనం తర్వాత ఒక యాలకును నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గుండెల్లో మంట, అజీర్తి లాంటి సమస్యలను పరిష్కరించడానికి యాలకులు ఎంతో సహకరిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా భోజనం తర్వాత యాలకులు తినడం అన్నిరకాలుగా కలిసివస్తుంది.

35
నోటి దుర్వాసన

నోటిదుర్వాసనతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ ఆహారం తిన్నాక ఒక యాలకని నోట్లో వేసుకుని నమిలితే ఎంతో మంచిది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను పోగొడుతాయి. నోటి ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.

45
వికారం, వాంతులు

వికారం, వాంతులను అరికట్టడానికి కూడా భోజనం తర్వాత యాలకులు నమలడం మంచిది. ఒత్తిడి తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రాత్రి మంచి నిద్ర పట్టడానికి రాత్రి భోజనం తర్వాత యాలకులు తినడం మంచిది.

55
రోగనిరోధక శక్తి

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే యాలకులను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఉన్న యాలకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా యాలకులు మంచివి.

Read more Photos on
click me!

Recommended Stories