భార్యాభర్తల బంధం చివరి వరకు ఉండే బంధం. ఇద్దరూ ఒకరినొకరు నమ్ముకుంటూ సర్దుకుపోవడమే సంసారం. అయితే, వీరి బంధం బలంగా ఉండాలంటే భర్త తన భార్యకు తప్పకుండా 5 సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆచార్య చాణక్య తన నీతి సూక్తులతో వివరించారు. వాటిలో..
1. డబ్బు
ప్రతి భర్త తన భార్యకు డబ్బు ఇవ్వాలి. దీని ద్వారా మహిళ తన అవసరాలను, అభిరుచులను తీర్చుకోగలదు. ఇలా చేయడం వల్ల భార్య తన భర్తతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఇదివరకు మహిళలు గృహిణులుగా ఉండేవారు. కాబట్టి చాణక్యుడు ఈ మాట చెప్పాడు. నేడు మహిళలు ఆర్థిక విషయాల్లో స్వతంత్రంగా ఉంటున్నారు.
2. గౌరవం
ప్రతి భర్త తన భార్యకు గౌరవం ఇవ్వాలి. ఏ కారణం చేత కూడా అవమానించకూడదు. ఇది ప్రేమ జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ముఖ్యంగా మూడో వ్యక్తి ముందు అవమానించే పని చేయకూడదు. ఇలా చేస్తే భార్య ఆత్మగౌరవానికి భంగం వాటిల్లి సంసారంలో మనస్పర్థలు రావచ్చు.
3. రక్షణ
ప్రతి భార్య తన భర్త అన్ని సందర్భాల్లోనూ తనను రక్షించాలని కోరుకుంటుంది. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా తన భార్యను రక్షించడం భర్త కర్తవ్యం. భార్య చేసే అన్ని పనులకు భర్త వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించాలి. దీనివల్ల భార్యకు తాను సురక్షితంగా ఉన్నాననే భావన కలుగుతుంది.
4. ప్రేమ వాతావరణం
దంపతుల మధ్య ప్రేమ చాలా ముఖ్యం. భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భర్త అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి. బయటి విషయాలు లేదా పని ఒత్తిడిని ఇంటి వరకు తీసుకువచ్చే తప్పును పురుషులు ఎప్పుడూ చేయకూడదు.
5. శారీరక సుఖం
భార్య కూడా తన భర్త నుండి శారీరక సుఖాన్ని ఆశిస్తుంది. ఈ విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.