ముంగీస ఒక్కటే కాదు... పాము కాటేసినా ప్రాణంపోని జీవులివే

పామును చూస్తేనే చాలామంది భయంతో వణికిపోతారు.  అలాంటిది అత్యంత విషపూరిత పాములతో పోరాడి ప్రాణాలు దక్కించుకునే జంతువులు కొన్ని ఉన్నాయి. వీటిలో ముంగీస గురించి చాలామందికి తెలుసు. మరి మిగతా జంతువులేవో తెలుసా? ఇలా పామువిషం పనిచేయని జంతువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Animals That Survive Snake Bites: Natures Venom Resistant Creatures in telugu akp
Snake

మనిషి జంతు ప్రేమికుడు... పురాతన కాలంనుండే ఆవులు, గేదెలు, మేకలు, గుర్రాలు, గాడిదలు వంటి మూగజీవులను మచ్చిక చేసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. ఇక ఈ కాలంలో కుక్కలు, పిల్లలు వంటి సాధుజీవులతో పాటు ప్రమాదకరమైన అడవి జంతువులను కూడా పెంచుకునేవారు ఉన్నారు. కానీ పాములను పెంచడం ఎక్కడైనా చూసారా? కోరలు తీసిన పాములను కొందరు పొట్టకూటికోసం పెంచుతుంటారు... కానీ విష సర్పాలను మాత్రం ఎవ్వరూ పెంచరు. 

పాము విషం మనిషి ప్రాణాలు తీస్తుంది... కొన్నిపాములు కాటేసాయో అంతే సంగతి... క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం.  అయితే కొన్ని జంతువులను మాత్రం పాములు ఏం చేయలేవు. పాము కాటేసినా ఆ విషం జంతువులపై పనిచేయదు. ఇలా పాము విషం పనిచేయని ఆ జంతువులేవో ఇక్కడ తెలుసుకుందాం. 

Mongoose

1. ముంగీస : 

పాము అనగానే మనకు వెంటనే ముంగీస గుర్తుకువస్తుంది. ఈ రెండింటికి అస్సలు పడదు... ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటాయి. ఇలా పోరాట సమయంలో ముంగీస పాముకాటుకు గురవుతుంది. కానీ ఈ పాము విషం దాన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ముంగిసలో విషాన్ని తటస్థీకరించే ప్రోటీన్లు ఉంటాయి... అవి పాము విషానికి వ్యతిరేకంగా సహజ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి పాము కాటేసినా ముంగీసకు ఏంకాదు. ప్రాణాలతో ఉంటుంది.

అయితే ముంగీస చాలా చురుగ్గా ఉంటుంది... పాముతో పోరాడే సమయంలో కాటుకు గురికాకుండా చూసుకుంటుంది. ఒకవేళ ఒకటి రెండుసార్లు పాము కాటేసినా ముంగీసకు ఏంకాదు. కానీ చాలాసార్లు పాముకాటుకు గురయి శరీరంలో ఎక్కువ మోతాదులో విషం చేరితే ముంగిసలోని రోగనిరోధక శక్తి పనిచేయదు...కాబట్టి అవి చనిపోయే అవకాశం ఉంటుంది.   
 


Opossum, Forest Pig

2. ఒపోసమ్స్ : 

అమెరికాలో కనిపించే ఈ జంతువులను కూడా పాముకాటు ఏం చేయలేదు. రాటిల్ స్నేక్, పిట్ వైపర్ వంటి ప్రమాదకరమైన పాముల విషానికి కూడా ఈ ఒపోసమ్స్ రోగనిరోధక శక్తిని కలిగివుంటాయి. అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కూడా ఈ ఒపోసమ్స్ తట్టుకోగలవన్నమాట. 

3. అడవిపందులు : 

అడవి పందులు కూడా పాము విషాన్ని తట్టుకోగలవు.  వీటిలో న్యార్కోటాక్సిన్ అనే రసాయనం ఉంటుంది... ఇది పాము విషానికి విరుగుడులా పనిచేస్తుంది. అందువల్లే అడవిపందులను పాములు ఏం చేయలేవు. 
 

honey badger, wood rat

4. హనీ బాడ్జర్లు : 

ఇవి కూడా ముంగిసల మాదిరిగానే పాములతో పోరాడగలవు. వీటిపై కూడా పాము విషం పనిచేయదు. ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన, భయంలేని జీవి ఈ హనీ బ్యాడ్జర్లు. అడవుల్లో ఒంటరిగా జీవిస్తాయి. ఇవి ఎంత పెద్ద పాములనైనా ఎదుర్కొంటాయి.

5. వుడ్ ర్యాట్ : 

ఇది ఎలుక జాతికి చెందినది. వీటిని వేటాడేందుకు పాములు ప్రయత్నిస్తుంటాయి... అయితే పాముల విషం వీటిపై పనిచేయదు. అందువల్లే వీటిని కాటేసి చంపకుండా అమాంతం మింగేస్తుంటాయి పాములు. 
 

Porcupine

6. ముల్లపందులు : 

ఒళ్లంతా ముళ్లతో కనిపించే ముల్లపందిని కూడా పాములు ఏం చేయలేవు. సహజంగానే ఒళ్ళంతా ముళ్లు కలిగివుండే ఇవి ముట్టుకోడానే వీలులేకుండా ఉంటాయి. అయినా పాములు కాటేసినా విషాన్ని తట్టుకునే శక్తి వీటిలో సహజంగానే ఏర్పడి ఉంటుంది. అందువల్ల ముల్లపందులపై పాము విషం పనిచేయదు. 

Latest Videos

vuukle one pixel image
click me!