భారతదేశ గొప్ప పండితుల్లో చాణక్యుడు ఒకరు. మనిషి జీవితంలోని ప్రతి అంశం గురించి చాణక్యుడు తన నీతిసూత్రాల్లో పేర్కొన్నాడు. ఆయన చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వాటిని చాలామంది ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా చాణక్యుడు మనుషుల ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం మధ్యాహ్నం నిద్ర పోతే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
పగటిపూట నిద్ర
పగటిపూట నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పాడు. మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక కచ్చితంగా నిద్రపోతారు. కానీ చాణక్య నీతి ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. ఎందుకో ఇక్కడ చూద్దాం.
మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుంది?
చాణక్య నీతి ప్రకారం మధ్యాహ్నం నిద్రపోయేవాళ్లు ఇతరులకన్నా తక్కువ పని చేస్తారు. దీనివల్ల వాళ్ల ఉద్యోగం పోతుంది. వీళ్లు టైమ్ వేస్ట్ చేయడం తప్ప జీవితంలో ఏమీ చేయలేరు. కొన్నిసార్లు డబ్బు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.
ఎవరు నిద్రపోవచ్చు?
చాణక్య నీతి ప్రకారం అనారోగ్యంతో ఉన్నవాళ్లు, గర్భిణులు, చిన్న పిల్లలు మాత్రమే మధ్యాహ్నం నిద్రపోవాలి. ఇలాంటి వాళ్లకు మాత్రమే పగటిపూట నిద్రపోయే హక్కు ఉంది అంటాడు చాణక్యుడు. ఆరోగ్యంగా ఉంటే మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలని చెబుతాడు చాణక్యుడు. మధ్యాహ్నం నిద్రపోతే టైమ్ వేస్ట్ తప్పా ప్రయోజనం లేదంటాడు.
వ్యాధులు వచ్చే ప్రమాదం
చాణక్యుడి ప్రకారం మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లాంటి కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రాత్రి కూడా నిద్ర సరిగ్గా పట్టదు. మధ్యాహ్నం 10 నుంచి 15 నిమిషాలు పవర్ న్యాప్ తీసుకుంటే ఏం కాదు. కానీ 2 నుంచి 3 గంటలు నిద్రపోతే ఆరోగ్యం పాడవుతుందని డాక్టర్లు చెబుతుంటారు.
మధ్యాహ్నం నిద్రపోతే?
మధ్యాహ్నం నిద్రపోతే ఆయుష్షు తగ్గుతుందని చాణక్యుడు నమ్ముతాడు. భగవంతుడు మనిషి ప్రతి శ్వాసను లెక్కిస్తాడట. నిద్రపోయేటప్పుడు మనిషి వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు కాబట్టి మధ్యాహ్నం నిద్రపోయే వాళ్ల ఆయుష్షు తగ్గుతుందని చాణక్యుడి నీతి సూత్రాలు చెబుతున్నాయి.
సోమరితనం వస్తుందా?
చాణక్యుడి ప్రకారం మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి తగ్గుతుంది. సోమరితనం వస్తుంది. ఇలాంటి వాళ్లు మధ్యాహ్నం తర్వాత ఏ పని చేయాలని అనుకోరు. ఈ తీరు వాళ్ల కెరీర్‌ను నాశనం చేస్తుందని చాణక్య నీతి చెబుతోంది.