కొంతమందికి ఎప్పుడో ఒకసారి తలనొప్పి వస్తే.. ఇంకొంత మందికి మాత్రం తరచుగా వస్తూనే ఉంటుంది. నిజానికి ఈ తలనొప్పి ఏదో ఒక కారణం వల్ల రాదు. తలనొప్పి రావడానికి ఎన్నో బలమైన కారణాలున్నాయి. అసలు మీకు తలనొప్పి ఏ కారణం వల్ల వస్తుందో తెలియాలంటే కొన్ని టెస్ట్ లు చేయించుకోవాల్సిందే. తలనొప్పి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి తీవ్రమైన అనారోగ్యాల వరకు సంకేతం కావొచ్చు. అందుకే తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. వాతావరణ మార్పు, దాని వల్ల కలిగే అంటువ్యాధులు దగ్గు, జలుబు, ఘాటైన వాసనలు, కాంతి, ఒత్తిడి, రుతుక్రమ సమస్యలు మొదలైనవి సాధారణంగా తలనొప్పికి కారణమయ్యే కొన్ని కారకాలు.