కాలీఫ్లవర్ అధికంగా దొరికే కాలం ఇది. మార్కెట్లో కాలీ ఫ్లవర్ అమ్మకాలు జోరుగా సాగుతాయి. దీంతో చేసే గోబీ మంచూరియా, గోబీ రైస్, కూరలు, వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు మాత్రం వీటిని తినకూడదు.
కాలీఫ్లవర్ తో చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. అందులోనూ ఇది సీజనరల్ గా దొరికేది. కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. వానాకాలం నుంచి చలికాలం వరకు మార్కెట్లలో దీన్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. దీనిలో పోషకాలు కూడా ఎక్కువే. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, ఫైబర్, భాస్వరం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలున్నా కూడా కొంతమంది మాత్రం దీన్ని తినకూడదు. ఎవరెవరు కాలీఫ్లవర్ తినకూడదో తెలుసుకోండి.
27
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు
కొంతమందికి గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు కాలీఫ్లవర్ తినకండి. ఎందుకంటే దానిలో ఉండే కార్బోహైడ్రేట్ సులభంగా జీర్ణం కాదు, జీర్ణ సమస్యలను మరింతగా పెంచేస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్య మరింతగా ముదిరిపోయే అవకాశం ఉంది.
37
మలబద్ధకం
మీకు మలబద్ధకం సమస్య ఉందా? అయితే ఎట్టి పరిస్థితుల్లో కాలీఫ్లవర్ తినకూడదు. ఈ కూరగాయ మీకున్న మలబద్ధకం సమస్యను మరింతగా పెంచేస్తుంది.
మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువైపోతోంది. మీకు కూడా థైరాయిడ్ కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే మీరు కాలీఫ్లవర్ తిన్నప్పుడు అది మీ థైరాయిడ్ గ్రంథిలో T3, T4 హార్మోన్లను పెంచుతుంది. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదని చెబుతారు. అలా కాలీఫ్లవర్ తింటే థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది.
57
కిడ్నీ స్టోన్స్
కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నవారు కూడా కాలీఫ్లవర్ తినడం మానుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల అది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింతగా పెంచుతుంది. అలాగే కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినడం మానుకోవడం మంచిది.
67
అధిక రక్తపోటు
కాలీఫ్లవర్ తినడం వల్ల రక్తం ఎక్కువగా గడ్డకడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికే రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తినకండి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినడం మానుకోవాలి.
77
పాలిచ్చే తల్లులు
పాలిచ్చే తల్లులు కాలీఫ్లవర్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కాలీఫ్లవర్ తిన్న తరువాత ఆ తల్లి పాలు తాగే బిడ్డకు కడుపు నొప్పి, గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.