Vastu Tips: వంటగదిలో మీ చేతిలోంచి ఈ వస్తువులు పదేపదే కింద పడుతున్నాయా? ఎంత అశుభమో తెలుసా?

Published : Sep 08, 2025, 01:14 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు ఇంట్లో జరగడం మంచిది కాదు. మరికొన్ని పనులు ఇంటికి మంచి చేస్తాయి. వంట గదిలో పదేపదే మీ చేతుల్లోంచి కొన్ని రకాల వస్తువులు పడిపోవడం అనేది మంచిదో కాదో తెలుసుకోండి. 

PREV
14
వాస్తు చిట్కాలు

ఒక మనిషి ప్రశాంతంగా జీవించాలంటే వాస్తు పరంగా కూడా ఎలాంటి లోపాలు ఉండకూడదు. ఇంట్లో వాస్తు లోపాలు ఉంటే ఆ ఇంటి సభ్యులకు సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి. అందుకే వాస్తు శాస్త్రం ఎన్నో విషయాలను వివరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది కూడా ఎంతో ముఖ్యమైనది. వంట గదిలో కొన్ని వస్తువులు మీ చేతి నుండి పదే పదే జారిపోతుంటే దానికి అర్థం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

24
ఉప్పు, ఆవనూనె జారితే

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం అప్పుడప్పుడు చేతుల్లోంచి ఉప్పు, ఆవనూనె ఉన్న గిన్నెలు కింద పడడం సహజం. వాస్తు శాస్త్రం చెప్పిన ప్రకారం ఇది మంచి పద్ధతి కాదు. ఇదెంతో అశుభం. చాలాసార్లు ఉప్పు చేతి నుండి కింద పడిపోతుంది. మీకు పదేపదే ఇలా జరుగుతూ ఉంటే దాన్ని తేలికగా తీసుకోకండి. మీకు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం రాబోతోందని చెప్పే సూచన ఇది. అలాగే ఆవనూనె కింద పడితే శని దేవుడు మీ పై కోపంగా ఉన్నాడని సంకేతం.

34
వంటగదిలో పాత్రలు పడితే

వంటగదిలో మీ చేతుల్లోంచి పదేపదే పాత్రలు చేయి జారి కింద పడడం శుభప్రదం కాదు. అలా గిన్నెలు పడిపోవడం లేక అవి విరిగిపోవడం అనేది పెద్ద సమస్య వస్తోందని చెప్పే సంకేతమే. మీ వంట గదిలో పదేపదే ఇలా జరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉందని అర్థం. మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా రావచ్చు.

44
కుళాయి కారకుండా

ఒక్కోసారి ఇంట్లో ఉన్న కుళాయిల నుండి చుక్కా చుక్కా నీరు పోతూ ఉంటుంది. చాలామంది చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇలా వదిలేయడం కూడా ఏమాత్రం మంచిది. కాదు అలా కుళాయిల నుండి నీరు చుక్కగా కారిపోతూ ఉంటే అది శుభకరం కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయని చెప్పడమే దీని అర్థం. కాబట్టి కొళాయి నుంచి వాటర్ వృధాగా పోకుండా అడ్డుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories