Superfood For Kids: మీ పిల్లలు స్మార్ట్ గా పెరగాలా? అయితే ఈ ఫుడ్స్ ను రోజూ పెట్టండి..

First Published Aug 19, 2022, 1:59 PM IST

Superfood For Kids: పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు పోషకాహారం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు మీరు పెట్టే ఫుడ్ యే మీ పిల్లలు డల్ గా లేదా హుషారుగా ఉండాలో డిసైడ్ చేస్తుంది. 

ప్రతి తల్లిదండ్రులు పిల్లల ఫ్యూచర్ గురించి, వారి చదువుల గురించి ఎంతో ఆలోచిస్తారు. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. చదువులో రాణించాలన్నా.. మీరు వారికి హెల్తీ ఫుడ్ నే పెట్టాలి. ఎందుకంటే ఆ హెల్తీ ఫుడ్ యే మీ పిల్లల్ని హుషారుగా, బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడానికి సహాయపడతాయి. అయితే పిల్లలకు ఎట్టిపరిస్థితిలో జంక్ ఫుడ్, పాస్ట్ ఫుడ్ ను అస్సలు పెట్టకూడదు. వారికి ఇష్టమున్నా సరే. ఎందుకంటే ఇవి పిల్లల శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అంతేకాదు వారిని ఊబకాయం బారిన పడేస్తాయి.

పిల్లలు మెదడు షార్ప్ గా పనిచేయడానికి పోషకాహారం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు పిల్లలు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. అంతేకాదు పిజ్జాలు, బర్గర్లను పెట్టకండి. ఇవి వారి హెల్త్ ను నాశనం చేస్తాయి. మీ పిల్లలకు కొన్ని ఆహారాలను రోజూ పెడితే వారి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. అవేంటంటే.. 

అరటిపండు

అరటి పెద్దలకే కాదు పిల్లలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్. మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, పొటాషియం, విటమిన్  బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికే కాదు బ్రెయిన్ కు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అరటిపండును తినడం వల్ల తక్షణ శక్తి అందుతుంది.
 

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో ఎన్నో పోషకాలుంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ  ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు. ఫైబర్ శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. అందుకే వీటినీ రోజూ తినాలి. 
 

నెయ్యి

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పిల్లలకు కొద్ది మొత్తంలో రోజూ నెయ్యిని తినిపించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి.  దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు  ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 
 

పాలు

పాలు మంచి పోషకాహారం. దీనిలో కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పిల్లలకు పాలంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ పిల్లలు పాలు తాగడం వల్ల వారి ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. అందుకే పిల్లలకు రోజూ పాలు తాగించాలి. 
 

గుడ్లు

గుడ్లలో ఉండే పోషకాలు అనేకం. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బి, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ డి లు ఎక్కువగా ఉంటాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును బ్రేక్ ఫాస్ట్ లో ఇస్తే పిల్లల శరీర, బ్రెయిన్ ఎదుగుదల బాగుంటుంది.  

click me!