చల్లగా ఒక బీరు వేస్తే ఉంటుంది.. చాలా మంది బీరు ప్రియులు ఇదే అభిప్రాయంతో ఉంటారు. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా బీర్లు లాగించేస్తుంటారు. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరుగుతాయి. ఇదిలా ఉంటే భవిష్యత్తుల్లో బీర్ రుచి ఇలాగే ఉండదా? మారుతుందా.? అంటే అవుననే అంటున్నారు నిపుణులు..
సాధారణంగా బీరు తయారీలో బార్లీ గింజలు, హోప్స్, ఈస్ట్, నీటిని ఉపయోగిస్తారు. వీటి నాణ్యత ఆధారంగానే బీరు రుచి ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఈ పదార్థాల నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ వాతావారణంలో మార్పునకు బీర్ రుచికి మధ్య సంబంధం ఏంటనేగా మీ సందేహం. ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
24
Image Credit: Getty Images
బీరు తయారీలో బార్లీ (గోధుమ)ది కీలక పాత్ర. వీటి నాణ్యత మారితే బీర్ రుచి మారుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే బార్లీ గింజల నాణ్యత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా అధిక వర్షాలు కూడా గోధుల దిగుబడి తగ్గేందుకు కారణమవుతుందని అంటున్నారు.
ఇక వేడి వాతావరణం కారణంగా గోధుమ పంటలకు వ్యాధులు పెరుగుతాయి. బార్లీ గింజల్లో షుగర్ లెవల్స్ తగ్గితే ఫెర్మెంటేషన్‌లో తేడా ఏర్పడి బీరు తీపిగా లేదా చేదుగా మారొచ్చు. బార్లీ దిగుబడి పూర్తిగా తగ్గితే బీరు తయారీదారులు ప్రత్యామ్నాయ ధాన్యాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇది బీరు రెగ్యులర్ రుచిని మార్చే అవకాశం ఉంటుంది.
34
Image Credit: Getty Images
హోప్స్ (బీరు తయారీలో ఉపయోగించే ఒక రకమైన పువ్వ) బీరుకు ప్రత్యేకమైన చేదు, రుచిని అందిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హోప్స్‌లోని యాసిడ్లు స్థాయిలు తగ్గిపోతాయి, ఇది చేదు ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఒకవేళ తగినంత నీరు లేకపోతే హాప్స్ మొక్కలకు తగినంత తేమ అందదు, వాటి పెరుగుదల తగ్గుతుంది. అధిక తేమ ఉన్న ప్రదేశాల్లో హాప్స్ పంటపై ఫంగల్ (శిలీంద్ర) వ్యాధులు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. హాప్స్ లోని నూనెలు తగ్గిపోతే, బీరు అరోమా తక్కువగా ఉంటుంది.
44
Image Credit: Getty Images
ఇక బీరు తయారీలో మరో ముఖ్యమైంది నీరు. బీరు తయారీలో 90 శాతం నీరే ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా నీటి నాణ్యతలో ఏర్పడే మార్పులు బీరు రుచిని మార్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కొన్నిచోట్ల నీటి నాణ్యత తగ్గుతుంది. నీటి హార్డ్‌నెస్ పెరిగినా బీర్ రుచి మారుతుంది. సాఫ్ట్ వాటర్‌కు బదులుగా హార్డ్ వాటర్ వాడితే బీరు రుచి పూర్తిగా మారుతుంది.
బీరు రుచిని నిర్ణయించే కీలకమైన అంశాల్లో ఈస్ట్ ఒకటి. ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా ఈస్ట్ అణువులు వేగంగా పని చేసి, కొన్ని రకాల ఈస్టర్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం కూడా ఈస్ట్ పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతుంది. ఈస్ట్‌లో తేడాలు ఉంటే ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఇబ్బందులు వస్తాయి. ఇది బీర్ సాఫ్ట్‌నెస్‌ను తగ్గిస్తుంది.