ఈ చాక్లెట్‌ను వైన్, విస్కీ లాగే కొన్ని సంవత్సరాల పాటు వుడ్ బారెల్స్‌లో ఏజింగ్ చేస్తారు. ఒక్కో చాక్లెట్ బార్‌ని ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తారు. ఈ చాక్లెట్‌లో ఎలాంటి రసాయనాలు, చక్కెరను ఉపయోగించరు. ఈ చాక్లెట్‌ను ప్రత్యేకమై ప్యాకేజింగ్ చేస్తారు. ఒక్కో చాక్లెట్‌ను చిన్న వుడ్ బాక్స్‌లో, గోల్డ్ ఇంప్రింటెడ్ డిజైన్‌తో అందిస్తారు. ఈ చాక్లెట్ ధర ఎంతో తెలిస్తే ఔరా అనాల్సిందే. సుమారు 50 గ్రాముల చాక్లెట్ ధర అక్షరాల రూ. 60 వరకు ఉంటుంది.
ఇక ఈ చాక్లెట్ ధర ఇంత ఎక్కువనే ప్రశ్న రావడం సర్వసాధారణమైన విషయం. ప్రపంచంలోని Arriba Nacional కోకో బీన్స్ చాలా అరుదుగా లభిస్తున్నాయి. ఈ చాక్లెట్స్ ఆకు, వైన్, స్కాచ్ బారెల్స్‌లో ఏజింగ్ చేసి ప్రత్యేకమైన రుచి తీసుకువస్తారు. ఇక ఏడాదిలో కేవలం కొన్ని వందల చాక్లెట్ వందల బార్లు మాత్రమే తయారు చేస్తారు. ప్రీమియం ప్యాకేజీ, లగ్జరీ లుక్‌తో ప్యాకేజ్ చేస్తారు. ఈ చాక్లెట్‌ను నోట్లో వేసుకున్న వెంటనే ఓల్డ్ వైన్, స్కాచ్ నెమ్మదిగా కరిగి ఒకరమైన ఫీల్‌ను అందిస్తుంది.