నగర కాలుష్యం పురుషులకు ఓ శాపం.. వీరిలో రోజురోజూ తగ్గిపోతున్న స్పెర్మ్..

Published : Nov 03, 2022, 04:02 PM IST

గనరాళ్లో కాలుష్యం దారుణంగా పెరిగిపోతుంది. కలుషితమైన గాలి వల్ల ఊపిరితిత్తులు, కళ్లు, గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందన్న ముచ్చట అందరికీ తెలుసు.. కానీ తాజా అధ్యయనం ప్రకారం.. ఈ కాలుష్యం తల్లిదండ్రులు కాకుండా శాపంలా మారింది.  

PREV
16
నగర కాలుష్యం పురుషులకు ఓ శాపం.. వీరిలో రోజురోజూ తగ్గిపోతున్న స్పెర్మ్..

కలుషితమైన గాలి వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కంటి చూపు తగ్గుతుంది. కంటి సమస్యలు వస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం క్షీణిస్తుందన్న విషయాలు దాదాపు అందరికీ ఎరుకే.. కానీ ఇది పురుషులలో స్మెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరాళ్లో నివసించే వారి సెక్స్ డ్రైవ్ కు ఈ కలుషితమైన గాలి ప్రతికూకలంగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు.
 

26

నగరాల్లో నివసించే వారు ఈ గాలి కాలుష్యం వల్ల శ్వాసకోస సమస్యలు, ఉబ్బసం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, సైనసైటిస్ వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నాయి. అయితే ఇది పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్నవారిలో లైంగిక ఆసక్తిని తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 

36

ఆడ వంధ్యత్వం కంటే మగ వంధ్యత్వ రేటు ఎక్కువగా ఉంది.. 

గాలి కాలుష్యం వల్ల మగ వంధ్యత్వం రోజు రోజుకు పెరిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు.  దీనివల్ల జంట గర్భం దాల్చడం కష్టంగా మారింది. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారు. నగరాల్లో సంతానోత్పత్తి సమస్యను ఫేస్ చేస్తున్న పురుషుల సంఖ్య స్త్రీల కంటే 15 శాతం ఎక్కువగా ఉంది. ఈ గాలి కాలుష్యం మగ వంధ్యత్వానికి, గర్భస్రావాలకు ప్రధాన కారణంగా మారింది. 
 

46
Pollution

కాలుష్యం మగ వంధ్యత్వానికి ఎలా కారణమవుతుంది? 

విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ క్షీణిస్తుంది. అంటే గర్భందాల్చడానికి అవసరమైన దానికంటే స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంత తక్కువ స్పెర్స్, నాణ్యతలేని స్పెర్మ్ ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి చేరుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. భాగస్వామి గర్భం ధరించడంలో విఫలం అవుతుంది. సంభోగంలో ఆసక్తి లేకపోవడం మగ వంధ్యత్వం మొదటి లక్షణాల్లో ఒకటి. 
 

56

కాలుష్యం సెక్స్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది

ఎండోక్రైన్ డిస్‌రప్టర్ యాక్టివిటీ అంటే హార్మోన్‌ల అసమతుల్యత వల్ల  స్పెర్మ్ కణాలు తగ్గిపోతాయి. అలాగే చనిపోతాయి కూడా. మనం పీల్చే గాలిలో రాగి, జింక్, సీసం మొదలైన వాటితో తయారైన particulate matter ఉంటుంది. ఇవి ఈస్ట్రోజెనిక్, యాంటీ ఆండ్రోజెనిక్ లు. వీటిని పీల్చినట్టైతే టెస్టోస్టెరాన్, స్పెర్మ్ కణాల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

66


టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల సెక్స్ పై కోరికలు తగ్గుతాయి. దీంతో లైంగిక జీవితానికి ఆటంకం కలుగుతుంది. గాలిలో కలిసిన ఓజాన్, సల్పర్ డయాక్సైడ్, పార్టిక్యేట్ పదార్థాల  స్థాయిలు పెరిగి.. రక్తంలో రసాయనిక ప్రతిచర్యలకు కారణమవుతాయి. దీనివల్ల ఫ్రీరాడికల్స్ గాఢత పెరుగుతుంది. దీంతో పరోక్షంగా పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. గాలి కాలుష్యం వల్ల పిల్లల బరువు తక్కువగా ఉండటం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, టైం కంటే ముందుగానే పుట్టడం, శిశు  మరణాలు సంభవించే అవకాశం ఉంది. పేలవమైన స్పెర్మ్ నాణ్యత దీనికి పరోక్షంగా కారణం. 

Read more Photos on
click me!

Recommended Stories