వ్యాయామం చేసే అలవాటు లేదా? అయితే మీ ఎముకల ఆరోగ్యం మరింత దిగజారుతుంది జాగ్రత్త..

Published : Nov 08, 2022, 12:53 PM ISTUpdated : Nov 08, 2022, 12:56 PM IST

ఒకే రకమైన జీవన శైలీ మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఎలాంటి వ్యాయామం, శారీరక శ్రమ చేయకపోతే.. మీ ఎముకల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. దీనివల్ల కూర్చోవడం, లేవడం, నడవడం మరింత కష్టమవుతుంది.   

PREV
18
వ్యాయామం చేసే అలవాటు లేదా? అయితే మీ ఎముకల ఆరోగ్యం మరింత దిగజారుతుంది జాగ్రత్త..

ఒక వయసుకు రాగానే ఎముకల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి, ఎముకల బలం తగ్గడం, విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎముకల ఆరోగ్యం మన లైఫ్ స్టైల్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఆహారం తింటున్నాం.. ఏం పనులు చేస్తున్నాం అన్న విషయాలపై మన ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం వల్ల  ఎముకల ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా తగినంతగా వ్యాయామం చేయకపోవడం వల్ల ఎముకలు వయసు పెరిగేకొద్దీ విరిగిపోయే ప్రమాదం ఉంది. 
 

28
bone

ఒకే రకమైన జీవన శైలి.. అంటే వ్యాయామం చేయకపోవడం వల్ల మన ఆరోగ్యం ఎన్నో విధాలా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇది ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వ్యాయామానికి ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటి..? వ్యాయామం చేయకపోతే ఎముకలకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38
exercise

వ్యాయామం చేయకపోవడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలొస్తాయి. ముఖ్యంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. శరీర బరువు పెరుగుతుంది. ఊబకాయం ఎక్కువవుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలొస్తాయి. మధుమేహంతో పాటుగా.. గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిశ్చల జీవనశైలి వల్ల ఎలాంటి సమస్యలొస్తాయంటే..

48

ఊబకాయం

శారీరక కదలికలు లేకుంటే మెటబాలిజం తగ్గుతుంది. ఇది మీ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీ శరీరానికి.. స్వీట్లు, ఇతర కొవ్వులును విచ్చిన్నం చేయడం కష్టంగా మారుతుంది. ఫలితంగా మీరు ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. ఈ అధిక బరువు మీ ఎముకలపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి మీ ఎముకలను మరింత బలహీనంగా మారుస్తుంది. 
 

58

కండరాల నష్టం

మీరు మీ కండరాలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల మీ కండరాల బలం బాగా తగ్గిపోతుంది. కండరాలే మన ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే క్రమం తప్పకుండా మీరు వ్యాయామం చేయకపోవడం వల్ల కండరాల స్థాయి తగ్గుతుంది. ఫలితంగా మీ ఎముకలు మరింత బలహీనంగా తయారవుతాయి. 
 

68

ఎముక క్షీణత

వ్యాయామం చేయకపోవడం కూడా మన ఎముకల ఆరోగ్యం నేరుగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఎముకల బలం తగ్గుతుంది. అలాగే మీ శరీరంలో ఖనిజాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది మీ ఎముకల క్షీణతను వేగవంతం చేస్తాయి. దీంతో బోలు ఎముకల వ్యాధి తో పాటుగా ఇతర ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 

78
bone health

వ్యాయామం చేయకపోవడం వల్ల ఒక్క ఎముకల ఆరోగ్యం క్షీణించమే కాదు.. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే.. 

మీ రోగనిరోధక వ్యవస్థ అంత బలంగా ఉండదు. 

రక్తప్రవాహం కూడా తక్కువగా ఉంటుంది. 

శరీరంలో మంట ఎక్కువవుతుంది. 

హార్మోన్లలో హెచ్చు తగ్గులు వస్తాయి. 

డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

మూడ్ స్వింగ్స్

అధిక కొలెస్ట్రాల్

కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రావొచ్చు. 
 

88

మీరు మీ కండరాలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల మీ కండరాల బలం బాగా తగ్గిపోతుంది. కండరాలే మన ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే క్రమం తప్పకుండా మీరు వ్యాయామం చేయకపోవడం వల్ల కండరాల స్థాయి తగ్గుతుంది. ఫలితంగా మీ ఎముకలు మరింత బలహీనంగా తయారవుతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories