Oil: కిచెన్ లో స్టవ్ పక్కనే ఆయిల్ డబ్బా పెడుతున్నారా? ఇది తెలిస్తే.. మళ్లీ అక్కడ పెట్టరు..!

Published : Sep 04, 2026, 08:14 AM IST

Oil: మీ ఇంట్లో ఆయిల్ డబ్బా ఎక్కడ పెడుతున్నారు? వంట చేయడానికి ఈజీగా ఉంటుంది అని స్టవ్ పక్కనే పెడుతున్నారా? అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఒక్క చిన్న పని.. మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది అంటే నమ్ముతారా?

PREV
13
కిచెన్ లో ఆయిల్ డబ్బా ఎక్కడ పెడుతున్నారు?

దాదాపు మీరు ఏ ఇంట్లో చూసినా.. కిచెన్ లోనే ఆయిల్ స్టోర్ చేస్తారు. అది కూడా స్టవ్ కి పక్కనే ఉంచుతారు. ఎందుకంటే, మనకు వంట చేసేటప్పుడు.. నూనె తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని, పని సులువు అవుతుంది అని పక్కనే ఉంచుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలని ఎంత ఖరీదైన నూనె వాడినా కూడా.. దానిని తప్పుడు ప్రదేశంలో ఉంచడం వల్ల మళ్లీ మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అంటే నమ్ముతారా? మీరు చదివింది నిజమే, కేవలం స్టవ్ కి దగ్గరలో నూనె డబ్బా ఉంచడం వల్ల.. మన ఆరోగ్యం దెబ్బతింటుంది.. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

23
స్టవ్ పక్కన నూనె డబ్బా పెడితే ఏమౌతుంది?

మనం ఎంత ఖరీదైన, ఆరోగ్యకరమైన నూనె వాడినా కూడా దానిని ఎక్కడ ఉంచుతున్నాం అనేది చాలా ముఖ్యం. వంట నూనెకు మూడు అత్యంత పెద్ద శత్రువులు.. వేడి, కాంతి, గాలి. మీరు స్టవ్ కి దగ్గరగా నూనె ఉంచడం వల్ల.. స్టవ్ నుంచి వచ్చే వేడి నిరంతం ఆ నూనె డబ్బాకు తగులుతూనే ఉంటుంది. ఈ వేడి కారణంగా నూనెలో ఆక్సిడేషన్ అనే రసాయన చర్య జరుగుతుంది. ఫలితంగా, నూనె తన సహజ గుణాలను కోల్పోయి.. డబ్బా తెరకముందే.. అత్యంత వేగంగా పాడైపోతుంది. అంతేకాదు, నిత్యం వేడికి గురయ్యే నూనెలో ఫ్రీ రాడికల్స్, విషపూరిత రసాయనాలు విడుదల అవుతాయి. ఈ నూనెను వాడి మనం వంట చేయడం వల్ల శరీరంలో మంట, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, వంట నూనెల్లో విటమిన్ ఈ, మంచి యాంటీ ఆక్సిడెంట్లు కూడా.. ఈ వేడి కారణంగానే పూర్తిగా నశిస్తాయి. ఫలితంగా, ఆ నూనె వాడటం వల్ల గుండెపోటు ప్రమాదం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, కీళ్ల నొప్పులు, భిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

పోషకాలన్నీ... బూడిదలో పోసిన పన్నీరే..

మనం గుండెకు మంచిదని సన్ ఫ్లవర్, ఆలివ్, లేదా నువ్వుల నూనెలను కొనుగోలు చేస్తాం. వీటిలో విటమిన్-E, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ స్టవ్ పక్కన ఉండే వేడి ప్రభావం వల్ల నూనెలోని ఈ అమూల్యమైన పోషకాలన్నీ పూర్తిగా నశించిపోతాయి. ఫలితంగా మీరు కొనుగోలు చేసిన ఖరీదైన నూనె కేవలం ఒక పోషక విలువలు లేని జిడ్డు పదార్థంగా మిగిలిపోతుంది. ఈ నూనెను మనం వంటకు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు.

33
వంట నూనెను ఎక్కడ పెట్టాలి..?

చల్లని, చీకటి ప్రదేశం: నూనె డబ్బాలను ఎల్లప్పుడూ స్టవ్‌కు కనీసం 3-4 అడుగుల దూరంలో, వేడి, సూర్యకాంతి తగలని మూసివున్న కిచెన్ క్యాబినెట్ లేదా అల్మారాలో ఉంచండి.

గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్ వాడండి: నూనెను ప్లాస్టిక్ సీసాలలో ఉంచడం కంటే గాజు సీసాల్లో..ముఖ్యంగా డార్క్ కలర్ గ్లాస్ బాటిల్స్ లేదా స్టీల్ పాత్రలలో ఉంచడం వల్ల నూనె ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

మూత గట్టిగా పెట్టండి: గాలి తగిలితే నూనె త్వరగా పాడవుతుంది. కాబట్టి వాడిన వెంటనే మూతను గట్టిగా బిగించాలి.

నూనె పాడైందని ఎలా గుర్తించాలి?: నూనె రంగు ముదురు నల్లగా మారినా, దానంతట అదే చిక్కబడి జిగటగా అనిపించినా, లేదా డబ్బా తెరిచినప్పుడు ఒక రకమైన వాసన వస్తే ఆ నూనెను వెంటనే పారబోయడం మంచిది. అలాంటి నూనె వాడకపోవడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories