Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?

Published : Aug 03, 2026, 04:38 PM IST

Milk Cooker:  గిన్నెలో మిరిగిస్తే పాలు పొంగిపోతాయనే  భయం ఉంటుంది. అందుకే కొంతమంది మిల్క్ కుక్కర్ వాడుతూ ఉంటారు. ఇందులో పాలు పొంగిపోతాయనే భయమే ఉండదు. అయితే మిల్క్ కుక్కర్ వాడడం ఎంతవరకు సేఫ్?

PREV
13
మిల్క్ కుక్కర్ వాడుతున్నారా?

పాలు స్టవ్ మీద పెట్టి మరిచిపోతుంటారు ఎంతో మంది. అలాంటి వారే ఎక్కువ మిల్క్ కుక్కర్ వాడుతూ ఉంటారు.  ఇందులో పాలు వేసి మరిగిస్తే విజిల్ వస్తుంది. పాలు మరిగాయని చెప్పడానికే ఆ విజిల్. చాలా ఇళ్లలో మిల్క్ కుక్కర్ వాడటం సాధారణం. కానీ ఈ కుక్కర్‌లో పాలు మరిగించడం ఆరోగ్యానికి మంచిదేనా? మిల్క్ కుక్కర్ వాడవచ్చా? అనే విషయాలు తెలుసుకోండి.

23
ఎలాంటి కుక్కర్ వాడాలి?

నిపుణులు చెబుతున్న ప్రకారం మంచి క్వాలిటీ ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ తో చేసిన మిల్క్ కుక్కర్ వాడితే మంచిది. వాటివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్టీల్ కుక్కర్లో పాలను మరిగించడం వల్ల అందులోని హానికర బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. కానీ పాలను ఎక్కువసేపు లేదా అధిక ఉష్ణోగ్రతలో మరిగిస్తే మాత్రం విటమిన్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మిల్క్ కుక్కర్ వాడినా కూడా సమయానికి స్టవ్ కట్టేయాలి. మిల్క్ కుక్కర్ వాడితే పాలు పొంగి కిందపడవు. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది. అయితే వాడిన తర్వాత ప్రతిసారి కుక్కర్‌ను శుభ్రంగా కడగాలి. కుక్కర్ లోపల, మూత, విజిల్ భాగాల్లో పాల అవశేషాలు లేకుండా చూసుకోవాలి.

33
అల్యూమినియం వద్దు

బయట మార్కెట్లో అల్యూమినియం కుక్కర్లు కూడా అమ్ముతున్నారు. అలాగే నాణ్యత తక్కువగా ఉండే లోహపు కుక్కర్లు అమ్ముతున్నారు. వాటి కన్నా ఫుడ్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ వాడటం మంచి పద్దతి. కుక్కర్‌లో పగుళ్లు, తుప్పు, ఏదైనా డ్యామేజ్ కనిపిస్తే వెంటనే దాన్ని మార్చేయాలి.. దాన్ని వాడకూడదు. నాణ్యమైన మిల్క్ కుక్కర్‌ను వాడితే మంచిదే. శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే, ఎలాంటి సమస్య లేకుండా రోజూ దీనిని వాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories