గోవా అంటే కేవలం అందమైన సముద్రతీరాలు, ఫారెన్ కల్చర్ తో కూడిన పార్టీలే కాదు రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రకృతి అందాలతో కూడిన అద్భుతమైన పల్లెలు ఉన్నాయి. స్థానిక సంస్కృతి, ప్రశాంత వాతావరణం ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అలాంటి టాప్ 10 గోవా పల్లెలివే..
ఓల్డ్ గోవాకు దగ్గర్లో ఉంటుంది దివార్ ఐలాండ్. ఫెర్రీలో చిన్న ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ద్వీపంలోని పచ్చని పొలాలను చూస్తూ, సన్నని రోడ్లపై సైకిల్ తొక్కడం ఓ గొప్ప అనుభూతి.
2. లౌటోలిమ్ (Loutolim)
లౌటోలిమ్ గ్రామంలో అసలైన గోవా సంప్రదాయ ఇళ్లను చూడొచ్చు. కొబ్బరి తోటలు, ప్రశాంతమైన పరిసరాలు గోవా వారసత్వ సంపదను కళ్లకు కడతాయి.
25
పోర్చుగీస్ కాలంనాటి కాలనీలు, నీటిలో మునిగిన గ్రామాలు
3. అల్డొనా (Aldona)
మాపుసా నది ఒడ్డున ఉన్న అందమైన గ్రామం అల్డోనా. ఇక్కడ పోర్చుగీస్ కాలం నాటి ఇళ్లు, ప్రశాంతమైన వాతావరణం మనసును కట్టిపడేస్తాయి. ఫొటోలు దిగడానికి, సరదాగా నడవడానికి ఈ ఊరు చాలా బాగుంటుంది.
4. కుర్ది (Kurdi OR Curdi)
కుర్ది గ్రామం దక్షిణ గోవాలో ఉంది. ఇది సలౌలిమ్ డ్యామ్ నీటిలో మునిగిపోయిన ఊరు. వేసవిలో డ్యామ్‌లో నీటి మట్టం తగ్గినప్పుడు ఈ గ్రామం బయటపడుతుంది. అడవులు, కొండల మధ్య ఉన్న ఈ శిథిల గ్రామం చరిత్రను, ప్రశాంతతను పంచుతుంది.
35
గుహలు, నదులు, ప్రకృతి అందాలతో గోవా గ్రామాలు
5. చందోర్ (Chandor)
చందోర్ గ్రామం చారిత్రకు, వారసత్వానికి ప్రసిద్ధి. ఇక్కడ వందేళ్ల నాటి పురాతన భవనాలు, పచ్చని పరిసరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
6. రివోనా (Rivona)
గుహలు, నదులు, ప్రకృతి అందాలకు రివోనా పెట్టింది పేరు. గోవాలోని రద్దీ ప్రాంతాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది సరైన చోటు. ట్రెక్కింగ్ చేసేవారికి రివోనా ఒక అద్భుతమైన ప్రదేశం.
క్వెపెం గ్రామం చుట్టూ అడవులు, నదులు ఉన్నాయి. ఇక్కడి జలపాతాల వల్ల ఈ ప్రాంతం పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది.
8. కాన్సౌలిమ్ (Cansaulim)
కాన్సౌలిమ్ బీచ్ చాలా ఫేమస్. కానీ ఆ ఊరు కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఊరిలో ఉన్న సరస్సులు, గాలికి ఊగే తాటి చెట్లు, పచ్చని పొలాలు ప్రశాంతమైన అనుభూతినిస్తాయి.
55
గోవా స్టైల్ గుడిసెలు, పురాతన ఆలయాలతో గ్రామాలు
9. ఓలాలిమ్ (Olaulim)
ఉత్తర గోవాలోని ఓలాలిమ్ గ్రామం వరి పొలాలు, మడ అడవులు, బ్యాక్ వాటర్స్‌తో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. గోవా స్టైల్ గుడిసెలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
10. తంబ్‌డి సుర్లా (Tambdi Surla)
పశ్చిమ కనుమలలో ఉన్న తంబ్‌డి సుర్లా, పురాతన ఆలయం, దట్టమైన అడవి, ట్రెక్కింగ్ మార్గాలకు ప్రసిద్ధి. ఇది గోవాలోని అత్యంత అందమైన సహజ ప్రదేశాలలో ఒకటి.