breast cancer Symptoms: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. ఇవి రొమ్ము క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు..

Published : Jun 12, 2022, 04:56 PM IST

breast cancer Symptoms: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ (breast cancer) ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది.  దానికి కారణాలేంటి? దీని ప్రారంభ లక్షణాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

PREV
19
breast cancer Symptoms: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. ఇవి రొమ్ము క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు..

ఈ మధ్యకాలంలో మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది.  ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటి మహిమా చౌదరి కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఈ మహమ్మారి కేసులు ఇలా పెరగడానికి కారణాలు.. దాని ప్రారంభ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

29

రొమ్ము క్యాన్సర్ (Breast cancer):ఇది రొమ్ములో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది ఎక్కువగా స్త్రీలలోనే కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది పురుషులకు కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకటి లేదా రెండు రొమ్ముల్లో సంభవించవచ్చు. కణాలు అదుపు తప్పడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ బారిన పడతారు. రొమ్ము క్యాన్సర్ కొన్నిఅదనపు లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేంటంటే.. 

39

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు (Symptoms of breast cancer)

1. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో.. ఎదపై ఉండే చర్మంలో మార్పులను చూడవచ్చు. అటువంటి రొమ్ముల్లో వాపు, శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే రొమ్ముల రంగు మారడం, రొమ్ము చర్మం పొడిబారడం (Dryness of the breast skin)మరియు పొలుసులు (Scales)గా మారుతుంది. 
 

49

2. రొమ్ము క్యాన్సర్ ఇతర లక్షణాల గురించి చెప్పుకున్నట్టైతే..  చనుమొన నుంచి ఏవైనా స్రావాలు వస్తాయి. అవి పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. మీరు కూడా మీ చనుమొనల నుంచి ఇలాంటి స్రావాలను గమనించినట్టైతే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే చనుమొనల నుండి స్రావాలు రావడం క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

59
breast cancer

3. అనేక రొమ్ము క్యాన్సర్లు ఉన్నాయి. వీటికి కొన్ని సార్లు నొప్పి కలగకపోవచ్చు. కానీ కొన్నిసార్లు రొమ్ము మరియు చనుమొన చుట్టూ నొప్పి కలుగుతుంది. అలాంటి సందర్భంలో  రొమ్ము చుట్టూ ఎలాంటి నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

69

4. మీ రొమ్ము చుట్టూ ఎరుపు (Red), నీలం (Blue) లేదా ఊదారంగు (Purple)లో గాయం గుర్తులు కనిపించడం ప్రారంభించినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను కలవండి. అలాగే రొమ్ములలో వాపు ఉంటే కూడా మీరు ఖచ్చితతంగా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది రొమ్ము క్యాన్సర్ కు సంకేతం కావొచ్చు.
 

79

5. రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాల్లో..  మీ రొమ్ముల్లో ఒక రొమ్ము (Breast) సైజు మరో రొమ్ము కంటే పెద్దదిగా లేదా చిన్నదిగా ఉన్నట్లయితే..  అది రొమ్ము క్యాన్సర్ కు సంకేతం కావచ్చని గుర్తుంచుకోండి.

89

6. కణాల పెరుగుదల వల్ల చనుమొనలు (Nipples) లోపలికి తలక్రిందులుగా మారతాయి. ఇది తరచుగా అండోత్సర్గము (Ovulation) సమయంలో మరియు కొన్నిసార్లు పీరియడ్స్ (Periods) సమయంలో కూడా జరుగుతుంది. ఇది కాకుండా, మీ చనుమొనలు లోపలి వైపుకు మారితే  మీరు వైద్యుడిని సంప్రదించాలి. 

99

రొమ్ము క్యాన్సర్ కు చికిత్స విధానాలు చాలానే ఉన్నాయి. కాగా రోగి యోక్క క్యాన్సర్ దశను బట్టే చికిత్స విధానం మారుతుంది. కాగా ఈ క్యాన్సర్ ను కీమోథెరపీ, శస్త్రచికిత్స, హార్మోన్ ల థెరపీ ల ద్వారా నయం చేస్తారు. ఈ సమస్య నుంచి తొందరగా బయటపడాలంటే ఖచ్చితంగా 40 ఏండ్లు దాటిని వారు 6 నెలలకొకసారి క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే వారి జీవన శైలి బాగుండాలి. ప్రతి రోజూ వ్యాయామం, పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ అలవాట్లు క్యాన్సర్ నుంచి తొందరగా కోలుకునేలా చేస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories